స్పోర్ట్స్ వేర్ లో ప్రగ్య జైశ్వాల్ మంటలు రేపుతోంది

0

హాటెస్ట్… సెక్సీ అన్న వర్డింగ్ కి మీనింగ్ ఏమిటో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మడే సాక్ష్యం. తెలుగు జనానికి అంతగా పరిచయం అవసరం లేని ఈ బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ అన్న సంగతి తెలిసినదే. కంచె చిత్రంలో ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించిన ఈ భామ ఆ తర్వాత తనలోని అసలు కోణాన్ని బయటపెట్టి గ్లామరస్ క్వీన్ గా అదరగొట్టింది. అటుపై సోషల్ మీడియాల్లో ఒక రేంజులోనే చెలరేగిపోతోంది.

గత కొంతకాలంగా బాలీవుడ్ దివా దిశా పటానీ తరహాలోనే లోదుస్తుల బ్రాండ్లకు ప్రచారం చేస్తున్న ప్రగ్య హాటెస్ట్ అవతారం బోయ్స్ లో హాట్ టాపిక్ గా మారింది. లోదుస్తుల బ్రాండ్స్ సహా జిమ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ వేర్ కి సంబంధించిన రకరకాల దుస్తులకు ప్రచారం చేస్తోంది ప్రగ్య.

ఈ సిరీస్ లోనే ఇదిగో ఇలా హాటెస్ట్ లుక్ తో కనిపించి మంటలు రేపుతోంది. “చీకటిలో తనను తాను కోల్పోయింది. కానీ ఇంతలోనే ఇదిగో ఇలా తిరిగి తారల్లో చంద్రికలా మెరిసిపోతోంది“ అంటూ ఈమోజీలతో అదిరిపోయే కొటేషన్ ఇచ్చారు ఈ ఫోటోకి. బ్లాక్ అండ్ వైట్ లో కలర్ లో డిఫరెంట్ గ్రేడింగ్ లో ఈ ఫోటోని డిజైన్ చేయడం ఆసక్తికరం. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఆచార్య అమెరికా యాత్ర తర్వాత ప్రగ్యకు అవకాశాల్లేవ్. ఇటీవల వెబ్ సిరీస్ ల స్క్రిప్టులు వింటోందని అలాగే పవన్ సినిమాలో నటించే అవకాశం ఉందని రకరకాలుగా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. దేనినీ ఈ భామ అధికారికంగా కన్ఫామ్ చేయలేదు.