Templates by BIGtheme NET
Home >> Cinema News >> భర్త శ్రేయస్సు కోసం మిహీక ఉపవాస ధీక్ష

భర్త శ్రేయస్సు కోసం మిహీక ఉపవాస ధీక్ష


భర్త శ్రేయస్సు కోసం భార్య సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేయడం చూసేదే. ఈ ఆచారానికి తెలుగు సాంప్రదాయంలో ఉన్న విశిష్ఠత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం ఉపవాస ధీక్షలకు సమయం ఆసన్నమైన వేళ నూతనవధూవరుల ఉపవాస ధీక్షలు తెలుగు నాట ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి వేళ యంగ్ హీరో.. భళ్లాల దేవ రానా సతీమణి మిహీక కూడా ఉపవాస ధీక్షను ఆచరించారు.

అయితే ఇది ఉత్తరాది ట్రెడిషన్ లో. అక్కడ అయితే దానిని `కార్వా చౌత్` అని పిలుస్తారు. కార్వా చౌత్ ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధ పండుగ. రానా – మిహీక ఇటీవల వివాహం చేసుకున్న అనంతరం తొలిసారి సాంప్రదాయ కార్వా చౌత్ ని మిహీక జరుపుకున్నారు.

అందుకు సంబంధించిన ఫోటోని మిహీకా తల్లి స్వయంగా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మిహీకా ఎరుపు చీర మ్యాచింగ్ బ్లౌజ్ ధరించగా… రానా ఆమెను వెనుకగా కౌగిలించుకుని కనిపించారు. హ్యాపీ కర్వాచౌత్ దేవుడు ఆశీర్వదించారు.. అంటూ మిహీక తల్లి బంటీ బజాజ్ వ్యాఖ్యను జోడించారు.