ఎందులోనూ రాజీ పడని ప్రగ్యకు వర్కవుటవుతోందా?

0

కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ వెర్సటైలిటీ గురించి చెప్పాల్సిన పనే లేదు. అప్పటికప్పుడు సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది. అప్పటికప్పుడే పొట్టి నిక్కరులో రెబల్ గా మారిపోతుంది. అప్పటికప్పుడే ట్రెడిషనల్ డ్రెస్ లో అదరగొట్టడం ఈ అమ్మడి స్టైల్. ఈ భామ గ్లామరస్ క్వీన్ గా సోషల్ మీడియాల్లో ఒక రేంజులోనే చెలరేగిపోతోంది.

గత కొంతకాలంగా నెటిజనుల్లో ప్రగ్య హాటెస్ట్ ఫోటోషూట్లు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. రెగ్యులర్ గా లోదుస్తుల బ్రాండ్స్ సహా జిమ్ ఫిట్నెస్ స్పోర్ట్స్ వేర్ కి సంబంధించిన రకరకాల దుస్తులకు ప్రచారం చేస్తోంది ప్రగ్య.

తాజాగా మరోసారి డెనిమ్స్ నిక్కరులో హాటెస్ట్ లుక్ తో కనిపించి మంటలు పెట్టింది. బ్లాక్ టాప్ బ్లూ డెనిమ్స్ లో సింపుల్ గా స్మైలిస్తూ యూత్ ని కవ్విస్తోందిలా. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఆచార్య అమెరికా యాత్ర తర్వాత ప్రగ్యకు అవకాశాల్లేవ్. ఇటీవల వెబ్ సిరీస్ ల స్క్రిప్టులు వింటోందని అలాగే పవన్ సినిమాలో నటించే అవకాశం ఉందని రకరకాలుగా గాసిప్పులు షికార్ చేస్తున్నాయి. దేనినీ ఈ భామ అధికారికంగా కన్ఫామ్ చేయడం లేదు.