ముంబై వీధుల్లో మిల్కీ బ్యూటీ వీరవిహారం

0

మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఇటీవలే కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. ఏడెనిమిది నెలల విరామం అనంతరం షూటింగుల కోసం విమానాశ్రయాల వెంట పరిగెత్తుతూ అందుకు సంబంధించిన ఫోటోల్ని మిల్కీ బ్యూటీ షేర్ చేసింది.

తాజాగా తమన్నా షేర్ చేసిన ఓ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఈసారి ఔటింగులో ముంబై వీధుల్లో ఇలా బ్లాక్ లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమైంది. దాంతో పాటే షాపింగ్ చేసిన వేరొక బ్యాగ్ కనిపిస్తోంది.

అయితే అవేవీ వ్యూవర్స్ కంటిని ఆకర్షించలేదు కానీ.. మిల్కీ ధరించిన ఆ థై హై డ్రెస్ మాత్రం కంటికి కునుకుపట్టనివ్వని ట్రీటిచ్చింది. పసుపు తెలుపు గడుల ఫ్రాకులో ఆన్ రోడ్ థై సొగసుల్ని ఎలివేట్ చేసింది. మిల్కీ అందాల తళుకుబెళుకులు ప్రదర్శించింది. ఈ డ్రెస్ లో మిల్కీ లెగ్ సౌందర్యం ఆద్యంతం ఆకర్షించింది.

తమన్నా కెరీర్ సంగతి చూస్తే.. గోపిచంద్ సరసన సీటీమార్ లో నటిస్తోంది. అలాగే `లవ్ మోక్ టైల్` రీమేక్ `గుర్తుందా శీతాకాలం`.. అంధాధున్ తెలుగు రీమేక్ లలో తమన్నా నటిస్తోంది. `ది నవంబర్ స్టోరీ` తమిళ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకొస్తోంది. తన కెరీర్ తొలి డిజిటల్ సిరీస్ డిస్నీ ప్లస్ లో రిలీజ్ కి రెడీ అవుతుంటే తమన్నా తెగ ఎగ్జయిట్ అయిపోతోంది.