Templates by BIGtheme NET
Home >> Cinema News >> నెటిజన్లను ఫిదా చేస్తున్న ప్రగ్యా మండే మోటివేషన్!!

నెటిజన్లను ఫిదా చేస్తున్న ప్రగ్యా మండే మోటివేషన్!!


ప్రగ్యా జైస్వాల్. తెలుగు పరిశ్రమలోని బ్యూటీలలో ఒకరు. మోడలింగ్ నుండి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ పాత్రలకు నో చెప్పలేదు. సినిమా కోసం ఎంత గ్లామర్ షో అయినా ఇట్టే చేసేయడానికి సిద్ధంగా ఉంటుంది. ‘డేగ’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ.. ‘టిటు ఎంబిఏ’ సినిమాతో అదే ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టాల్ సుందరి ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా అమ్మడి అందాల ఆరబోతే ప్రేక్షకులకు దగ్గరవడానికి మేజర్ కారణం. అప్పటి నుండి ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో రెచ్చిపోతూ తన అందాలను ఆరబోసింది. ప్రగ్యా అందాలు చూసి వెర్రెక్కిపోయే వీరాభిమానులు లక్షల్లో ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రగ్యా మండే మోటివేషన్ అంటూ ఓ యోగాసనం వేసిన వీడియో పోస్ట్ చేసింది.

అంతే నెటిజన్లు అభిమానులు ఊరుకుంటారా.. అలా అమ్మడి అందాలను ఆ యోగాసనంలో కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తలకిందులుగా ప్రగ్యా వేసిన ఆ యోగాసనం మనం మెచ్చుకోవాలి. ఆమె నాజూకుగా తన అందాలను మెయింటైన్ చేయడానికి యోగా కూడా ఓ కారణం. అది ఆమె మనకు గుర్తుచేస్తుంది. అందరూ యోగ చేయడానికి రెడీ కావాలని సిగ్నల్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. కానీ గ్లామర్ ప్రియులు యోగాలో కూడా ప్రగ్యా అందాలను ఓ రేంజిలో ఆరాధిస్తున్నారు. ఇప్పటికే లక్షలలో వ్యూస్ లైక్స్ ఈ వీడియోకు వచ్చాయట. ఈ మధ్యప్రదేశ్ గుమ్మ కంచె సినిమా తర్వాత మనోజ్ తో గుంటూరోడు సాయిధరమ్ తేజ్ తో నక్షత్రం సినిమాలలో గ్లామర్ షో చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. ఇక 2018లో విష్ణు హీరోగా వచ్చిన ఆచారి అమెరికా యాత్ర సినిమా తర్వాత ప్రగ్యా మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది. రెగ్యులర్ గా ఫోటోలు అప్లోడ్ చేస్తూనే ఉంది. మరి అమ్మడు మళ్లీ తెరపైకి ఎప్పుడు రానుందో చూడాలి!

#MondayMotivation #Yoga #AllDayEveryday 🧘‍♀️✨🤸🏻‍♀️ @yogpathic 😇🙏🏻

null