ఆయనకు `ఇబ్బందికరమైన` పడకగది అలవాటు ఉంది!- పీసీ

0

ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రెండో మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో గత ఏడాది మొదటి యానివర్శరీ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన బెడ్ రూమ్ సీక్రెట్ ని బయటపెట్టింది.

నిక్ ‘సూపర్ స్వీట్’ కానీ అతనికి కొంచెం ‘ఇబ్బందికరమైన’ పడకగది అలవాటు ఉంది అని ప్రియాంక తెలిపింది. నేను మేల్కొన్నప్పుడు నా ముఖం చూడాలని అతను పట్టుబడుతుంటాడు. అది నాకూ ఇష్టమే. కానీ నేను నిద్రలో వుండగా నా ముఖం చూడాలని నిక్ ఆశపడుతుంటాడు. కానీ నేను ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకున్నాక చూడాలనుకుంటాను. కానీ నిద్ర మత్తులో వున్న ముఖాన్ని తాను చూడాలనుకుంటాడు. అందుకే నిక్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ భర్త నుంచి ప్రతీ వైఫ్ కోరుకునేది ఇదే. ఈ విషయంలో నేను జోక్ చేయడం లేదు నిజమే చెబుతున్నాను` అని తన భర్త బెడ్రూమ్ సీక్రెట్ ని బయటపెట్టేసింది ప్రియాంక చోప్రా.

ప్రియాంక ప్రస్తుతం `టెక్స్ట్ ఫర్ యు` చిత్రీకరణ కోసం యుకెలో ఉంది. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఆమె తదుపరి చిత్రం రాబర్ట్ రోడ్రిగెజ్ `వి కెన్ బీ హీరోస్` కిడ్స్ ఇష్టపడే కాన్సెప్టుతో తెరకెక్కుతోంది. ఇందులో ప్రియాంక విలన్ పాత్ర పోషిస్తోంది.