ఆదిపురుష్ అయ్యే వరకు నాగ్ మూవీ ఆగదు

0

ప్రభాస్ రాధేశ్యామ్ పూర్తి అవ్వడమే ఆలస్యం ఆదిపురుష్ మూవీలో నటించబోతున్నట్లుగా దాదాపుగా కన్ఫర్మ్ వార్తలు వస్తున్నాయి. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ మూవీ పరిస్థితి ఏంటీ అంటూ ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆదిపురుష్ కంటే ముందు ప్రకటించి.. హీరోయిన్ గా దీపిక పదుకునేను అనౌన్స్ చేసి.. అమితాబచ్చన్ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా ప్రకటించి.. సింగీతంను మెంటర్ గా ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ను మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో నాగ్ అశ్విన్ మూవీ ఆదిపురుష్ పూర్తి అయిన తర్వాతే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆదిపురుష్ మూవీ 2022 ఆగస్టులో అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రకటన వచ్చింది కనుక ఆ సినిమా తర్వాతే నాగ్ అశ్విన్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందనేది చాలా మంది అభిప్రాయం. కాని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నాగ్ అశ్విన్ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ చివర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది. నటీనటుల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈసమయంలో నాగ్ అశ్విన్ మూవీ షూటింగ్ అప్ డేట్ చర్చనీయాంశంగా మారింది.

ఆది పురుష్ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక షూటింగ్ ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా అయితే కేవలం ఆరు నెలల్లోనే ఆదిపురుష్ పూర్తి చేస్తారు. ఆ లోపే నాగి మూవీని కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఆదిపురుష్ తో సంబంధం లేకుండా నాగ్ అశ్విన్ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. నాగ్ అశ్విన్ కూడా తన సినిమాను 2022లోనే విడుదల చేయాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఏదైనా ప్లాన్ తారు మారు అయితే తప్ప 2023కు వాయిదా పడే అవకాశం లేదంటున్నారు.