లో బడ్జెట్ సినిమాలకు ఓటీటీ మంచి అవకాశం

0

మొన్నటి వరకు సినిమా తీయడం పెద్ద కష్టం ఏమీ కాదు. కాని దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లడం చాలా పెద్ద కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉన్న నేపథ్యంలో ఓటీటీలు వచ్చాయి. కంటెంట్ బాగుంటే టేబుల్ ప్రాఫిట్ ఇచ్చి మరీ సినిమాను కొనుగోలు చేసేందుకు ఓటీటీలు ముందుకు వస్తున్నాయి. గతంలో కంటెంట్ బాగున్నా కూడా చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం కష్టం అయ్యేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయంది.

ఓటీటీలు రావడంతో చిన్న సినిమాల సంఖ్య పెరుగుతోంది. సినిమా తీయాలనే ఆసక్తి ఉన్నా కూడా థియేటర్లు దొరుకుతాయో లేదో అనే భయంతో చాలా మంది సినిమాను కనీసం ప్రారంభించకుండానే వదిలేసిన సందర్బాలు ఉండి ఉంటాయి. కాని ఇప్పుడు అలా లేదు. ఓటీటీ కోసం ప్రత్యేకంగా చిన్న బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. కోటి నుండి మూడు కోట్ల వరకు బడ్జెట్ సినిమాలు ఓటీటీలో విడుదల చేయడం ద్వారా లాభం పొందవచ్చు. మంచి కంటెంట్ తో లో బడ్జెట్ లో సినిమా తీస్తే ఖచ్చితంగా మంచి లాభాలను నిర్మాత చవి చూడవచ్చు అంటూ ఈమద్య వచ్చిన కొన్ని సినిమాలు నిరూపించాయి.

ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా తక్కువ బడ్జెట్ తో రూపొందాయి. ఓటీటీ వారు మంచి ఆఫర్ ను నిర్మాతలకు ఇవ్వడంతో క్లీయర్ గా లాభాలు దక్కడంతో పాటు ఓటీటీ కూడా మంచి వ్యూస్ ను దక్కించుకుని లాభం దక్కించుకున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే మంచి కంటెంట్ సినిమాలు కోటి కోటిన్నర లోపు లో తీస్తే మంచి ఆధరణ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.