ముఖానికి శస్త్ర చికిత్స తర్వాతే యాంకర్ లో ఇంతందం?

0

2016 లో 2004 స్లైస్-ఆఫ్-లైఫ్ టీవీ షో యే మేరీ లైఫ్ హై` లో పూజా పాత్రలో అదరగొట్టింది సామా శికందర్. ఆ తర్వాత కెరీర్ పరంగా వెనుదిరిగి చూసిందే లేదు. టీవీ హోస్ట్ గా నటిగా రాణిస్తోంది. అయితే గత ఆర్నెళ్ల క్రితం తనపై ఓ రూమర్ ప్రముఖంగా వినిపించింది. తన ముఖానికి శస్త్ర చికిత్స చేసిన అనంతరం ఇంతందంగా మారిందన్నది దాని సారాంశం.

అయితే ఆ తర్వాత షామా ఎంతో తెలివిగా నెటిజనులకు జవాబిచ్చారు. ఒకవేళ తాను కత్తి గాట్లకు సిద్ధమైతే దానిని దాచాల్సిన అవసరం లేదని అలాగని అందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదని సెలవిచ్చింది. నిజానికి నా రూపం మారిన ప్రతిసారీ కాస్మెటిక్ సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదని ఆమె చెప్పింది. ఒక కొత్త స్వీయ పరిణామానికి సహాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అని కూడా తెలిపింది.

2020 జనవరి నుంచి షామాపై సోషల్ మీడియా కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో # 10 ఇయర్ ఛాలెంజ్ చేసి.. తన రూపానికి సంబంధించి నాటి నేటి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ తర్వాత రూమర్లు మొదలయ్యాయి. మొదట నేను ఈ ఆరోపణలను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఏదో తప్పు చేశానని .. నేరస్థురాలినని ప్రచారం చేసినట్టే అనిపించింది. నేను అది చేశానో లేదో వారికి కూడా తెలియదు. వివరించడానికి నాకు ఎటువంటి కారణం కనిపించ లేదు.. లేదా దీని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఇది నా జీవితం. నేను కోరుకున్నది నేను చేయగలను. రెండవది నేను ఏమి చేశానో మీకు తెలియదు కదా!“ అని షామా జాతీయ మీడియాతో అన్నారు.

ఎవరైనా రూపం మారితే ప్రతిసారీ సర్జరీకి వెళ్లాల్సిన అవసరం లేదు అని షామా అన్నారు. “నా రూపం మారితే.. నేను ప్రతిరోజూ కత్తి పదును కిందకు వెళ్తున్నట్టేనా? నేను ప్రతిరోజూ మారుతూనే ఉన్నాను. నన్ను అనేవాళ్లు ఏదో కోల్పోయారా? అందుకే నేను ఆ వ్యక్తులతో ఏమీ చెప్పదలచుకోలేదు. ఇది వారి జీవితం“ అంటూ తనపై ప్రచారం చేసేవారికి కౌంటర్ వేశారు షామా. నాపై నేను దృష్టి సారిస్తానని ఆమె చెప్పింది.

నేను ఏం చేయాలనుకుంటున్నానో.. ఏం ఆలోచించాలనుకుంటున్నానో అదే ఆలోచిస్తాను. ఈ సమయాన్ని నేను ఏ విధంగానైనా మంచిగా మార్చడానికి పెట్టుబడి పెడతాను. నేను చేయగలను.. నేను చేస్తాను. నేను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు అని షామా ఎమోషనల్ నోట్ లో చెప్పారు. అన్నట్టు సోషల్ మీడియాల్లో ఇటీవల షామా చెలరేగుతున్న తీరు ఆసక్తికరం. నిరంతరం బికినీ బీచ్ ఫోటోషూట్లతో తెగ విరుచుకుపడుతున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ లో బోల్డ్ ఫోటోషూట్ తో షామా దుమారం రేపుతోంది. తనలోని సెక్సప్పీల్ గురించి యూత్ అదే పనిగా మాట్లాడుకుంటున్నారు మరి.