బిగ్ బాస్’ షో పై ఏసేసిన పునర్నవి…!

0

‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించిన పునర్నవి భూపాలం తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమే. ఈ తర్వాత ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పున్ను.. ‘బిగ్ బాస్’ సీజన్ – 3 తో క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా తనకు నచ్చని పనిని నచ్చలేదని చెప్తూ ప్రేక్షకులను ఆకర్షించింది. తన బొద్దు బొద్దు అందాలతో హౌజ్ ని హీటెక్కించింది పున్నూ. పొట్టి పొట్టి డ్రెస్సులతో బిగ్ బాస్ కే చమటలు పట్టించింది. వెండితెర మీద కనిపించినా రాని క్రేజీ ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌజ్ తెచ్చిపెట్టింది. అయితే పునర్నవి మాత్రం తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిన బిగ్ బాస్ షో మీద సంచలన కామెంట్స్ చేసింది.

కాగా ఈ మధ్య ప్లకార్డుల కొటేషన్స్ బాగా పాపులర్ అయ్యాయి. రోడ్డు మీద ఓ ప్లకార్డ్ పట్టుకోవడం.. దానిపై ఏదొక కొటేషన్ రాయడం ట్రెండ్ గా మారింది. ఇదే క్రమంలో తాజాగా పునర్నవి కూడా ఓ ప్లకార్డు పట్టుకొని కనిపించింది. అందులో ఒకదానిపై ‘బిగ్ బాస్ లోకి వెళ్లి ఏం నేర్చుకున్నావ్ పున్ను!’ అని రాసి ఉండగా.. ‘బిగ్ బాస్ లోకి వెళ్లకూడదని’ అని ఓ ఫ్లకార్డును పునర్నవి పట్టుకుని ఫోజిచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పునర్నవి ఇప్పుడు అదే షో పై సెటైర్ వేయడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే బిగ్ బాస్ ద్వారా పునర్నవి ఇమేజ్ వచ్చినప్పటికీ అదే స్థాయిలో ఆమెపై నెగిటివిటీ కూడా వచ్చి చేరింది. నిజానికి బిగ్ బాస్ షో కొందరికి మేలు చేస్తుంటే మరి కొందరికి మాత్రం నెగిటివ్ ఇమేజ్ తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో పునర్నవి హౌస్ లో ప్రవర్తించిన విధానం వల్ల నెగిటివ్ గా ప్రొజెక్ట్ అయింది. అంతేకాకుండా సింగర్ రాహుల్ – పునర్నవి ఎఫైర్ అంటూ వస్తున్న రూమర్స్ వల్ల కాస్త ఇబ్బంది పడినట్లు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పున్నూ ‘బిగ్ బాస్’ షో పై అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.