లంచం పుచ్చుకుంటే మగాడైనట్టా పూరీ?

0

వెర్సటైల్ డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ కి గుడ్ నేమ్ ఉంది. `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారాయన. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీని రూపొందిస్తున్నారు. గత కొన్ని నెలలుగా సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో పలు అంశాలపై `పూరి మ్యూజింగ్స్` పేరుతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా `కరప్షన్` అనే ఆంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పదేళ్ల కొడుకుతో తల్లి నాన్న బజారుకెళ్లి కూరగాయలు పట్టుకురా అంటుంది. అలాగే కిరాణా షాపుకెళ్లి సరుకులు తీసుకురా` అంటుంది. ఐస్ క్రీమ్ కి డబ్బులిస్తే తీసుకొస్తా అంటాడు. అలాగే నాన్న అనేసి ఇచ్చేస్తుంది. మరోసారి మరో పని చెబితే పానీ పూరీకి డబ్బులిస్తేగానీ వెళ్లను అంటాడు. వాడిని చూసి మురిసిపోతూ ఏంటో వీడికి ప్రతీదానికి లంచమే.. తర్వాత అదే టైప్ వెధవ ఆఫీసరే అవుతాడు. మనందరి సరదా తీర్చేస్తాడు. కన్న తల్లినే వదలని వాడు నిన్ను నన్ను వదులుతాడా.. ఇలా మారాం చేసే పిల్లలతో ప్రపంచం నిండిపోయింది. పవర్ వల్ల ఎవడైనా లంచగొండి అవుతాడు.

పవర్ వుండటం తప్పుకాదు.. ఆ పవర్ ఎవరి చేతుల్లో వుందన్నదే పాయింట్. అందుకే చిన్నప్పుడు మారాం చేసిన పిల్లలందరూ పవర్ కోసం పవర్ ఫుల్ పొజీషన్ కోసం ప్రయత్నిస్తారు. మెల్లగా అలాంటి జాబ్ లో జాయిన్ అయి దొరికిన కాడికి కుమ్మేస్తారు. ఎవరైనా రాజకీయ నాయకుడు అవినీతి చేసి వేల కోట్లు నొక్కేశాడని తెలిస్తే ఊగిపోతాం. అలా ఊగిపోయేవాడిని తీసుకెళ్లి అదే పోస్ట్ లో కూర్చోబెడితే వాడు అంతకంటే ఎక్కువ చేస్తాడు. భారతదేశంలో రాజకరీయ నాయకుల కన్నా ప్రజలు బలవంతులు. ఓటు అడిగితే ఫుట్ బాల్ ఆడుకుంటారు. ఇండియాలో పెట్టే ప్రతి సంతకం వెనక అవినీతి వుంది. వేసే ప్రతి ఓటు వెనక అంచం వుంది. అందుకే ప్రతీ ఏడాది ఎన్నికల ఖర్చు రెట్టింపవుతోంది` అంటూ పూరి కరప్షన్పై ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.