స్టార్ హీరో కోసం బికినీ వేస్తున్న రాశీ ఖన్నా..!

0

సౌత్ ఇండస్ట్రీ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా.. స్టార్ హీరో సినిమా కోసం బికినీ వేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. ఫస్ట్ సినిమాతోనే తెలుగువారి హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతూ టాలీవుడ్ లో పాగా వేసుకు కూర్చుంది. ‘జిల్’ ‘జై లవకుశ’ ‘తొలిప్రేమ’ ‘శివమ్’ ‘బెంగాల్ టైగర్’ ‘సుప్రీమ్’ ‘హైపర్’ ‘రాజా ది గ్రేట్’ ‘టచ్ చేసి చూడు’ ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఈ క్రమంలో గతేడాది ‘వెంకీమామ’ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది ఈ బూరెబుగ్గల సుందరి. అయితే ఈ ఏడాది ప్రారంభంలో రిలీజైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా పరాజయం తర్వాత మరో తెలుగు సినిమా కమిట్ అవలేదు రాశీ ఖన్నా. కాకపోతే కోలీవుడ్ లో మాత్రం రెండు సినిమాల్లో నటిస్తోంది.

కాగా రాశీ ఖన్నా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కలిసి ‘అరువా’ అనే మూవీలో నటిస్తోంది. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య కెరీర్లో 39వ చిత్రంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో స్టార్ట్ చేసి.. దీపావళి కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాశీ ఖన్నా బికినీ వేయడానికి రెడీ అయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెరీర్ స్టార్టింగ్ నుంచి గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ బబ్లీ బ్యూటీ.. ‘బెంగాల్ టైగర్’ సినిమా కోసం బికీనీ వేసింది. ఇప్పుడు మళ్ళీ సూర్య సినిమా కోసం గ్లామర్ షో చేసి కుర్రకారు మతులు పోగొట్టడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.