చక్కనమ్మ ఎంత బక్కచిక్కినా అందమే!

0

కొన్ని నెలల క్రితం రాశీ ఖన్నా వేరు.. ఇప్పటి రాశీ ఖన్నా వేరు. పూర్తిగా రూపం మారింది. బొద్దుతనం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్లిమ్మింగ్ బ్యూటీ రాశీ. జీరో సైజ్ కి కూతవేటు దూరంలో ఉంది.

ఆ సంగతి ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇట్టే గ్రహించేస్తారు అభిమానులు. అసలు ఆ అనవసర ఫ్యాట్ అంతా ఎటు పోయింది? అంతా మటుమాయం. పొట్ట చుట్టూ .. నడుము చుట్టూ ఎవ్వెరిథింగ్ గాన్! పొట్ట దిగువగా ఆరు మడతలు కనిపించేస్తున్నాయ్.

ఇదిగో ఇలా హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఇక్కడ జిమ్.. అటు చెన్నయ్ ముంబై వెళ్లినప్పుడు అక్కడ జిమ్ లను అస్సలు విడిచిపెట్టదు రాశీ. లేటెస్టుగా హైదరాబాద్ జిమ్ కి వెళుతూ లేదా తిరిగి వచ్చేస్తూ ఇలా టైట్ ట్రాక్ లో కనిపించింది. కోవిడ్ రూల్ ప్రకారం మాస్క్ ని ధరించింది. బ్లాక్ అండ్ ఎల్లో స్పోర్ట్ కాంబో అదిరెను.. రాశీ అందాలు మిరుమిట్లు గొలిపెను! అంటూ ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది. రాశీ నటిస్తున్న వాటిలో ఆరణ్మనై- తుగ్లక్ దర్బార్-మేధావి చిత్రీకరణలో ఉన్నాయి. సైతాన్ కా బచ్చా రిలీజ్ కి రావాల్సి ఉంది.