Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆరోజైనా రాధేశ్యామ్ టీజర్ రాబోతుందా..??

ఆరోజైనా రాధేశ్యామ్ టీజర్ రాబోతుందా..??


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే నాయకనాయికలుగా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాకోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్లతోనే అంచనాలు పెంచేసింది రాధేశ్యామ్. ఎప్పుడెప్పుడు అప్డేట్s ఇస్తారా అంటూ ఆశగా చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మిగతా హీరోల సినిమాలతో పోలిస్తే రాధేశ్యామ్ షూటింగ్ జరగబట్టి రెండేళ్ల పైనే అయింది. కానీ ఇప్పటివరకు రాధేశ్యామ్ టీజర్ బయటికి రాలేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ టీజర్స్ విడుదల చేసేసారు మేకర్స్. కానీ రాధేశ్యామ్ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ వాపోతున్నారు. టైటిల్ మోషన్ పోస్టర్స్ తప్ప ఇంతవరకు ఈ సినిమా గురించి ఎలాంటి సమాచారం లేదు.

పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా 1950-60 కాలానికి చెందిన ప్రేమకథగా రూపొందుతుందని టాక్. విక్రమ్ ఆదిత్య అనే క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో తెలుగే కాకుండా బాలీవుడ్ నటులు కూడా నటిస్తుండటంతో.. పాన్ ఇండియా మూవీగా ఐదు బాషలలో విడుదల కాబోతుంది. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తుంది. అయితే ఎంతో ఆశగా సంక్రాంతికి రాధేశ్యామ్ టీజర్ విడుదల చేస్తారని అభిమానులు ఎదురుచూసారు. కానీ ఎప్పటిలాగే దర్శకనిర్మాతలు ప్రేక్షకులను నిరాశకు గురిచేశారు. కానీ సినిమా మాత్రం సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తాజాగా ఈ నెలలో వాలంటైన్స్ డే రోజున రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తారని అంచనా వేస్తున్నారు. మరి జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.