#రాధే శ్యామ్: 24 గంటల్లో కోటి 50లక్షల వ్యూస్ తో సంచలనం

0

బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ సంచలనాల గురించి ఏమని చెప్పాలి. ప్రస్తుతం గూగుల్ ట్రెండింగ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నది ఇదే. ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రాధే శ్యామ్ మ్యూజికల్ మోషన్ పోస్టర్ నిన్న విడుదలైంది. విజయదశమి కానుకగా ఒక రోజు ముందే డార్లింగ్ అభిమానులకు అదిరిపోయే ట్రీటిచ్చాడు. దేశవ్యాప్తంగా అభిమానుల నుండి భారీ స్పందన అందుకుంది. అలాగే మోషన్ పోస్టర్ ఇండియా లెవల్లో భారీ రికార్డు సృష్టించింది. సల్మాన్.. షారూక్ .. అమీర్ కి సాధ్యం కాని రేంజులో అదిరిపోయే రికార్డునే అందుకున్నాడు ప్రభాస్.

విడుదలైన 24 గంటల్లోనే బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు… యూట్యూబ్.. ఇన్ స్టాగ్రామ్ .. ఫేస్ బుక్ లలో కోటి 50లక్షల (15 మిలియన్ల)కు పైగా వీక్షణలు పొందింది. ప్రభాస్ .. పూజా హెగ్డే జంటకు పాన్-ఇండియా లెవల్ ప్రజాదరణ దక్కింది. మోషన్ పోస్టర్ కోట్లాది మంది వీక్షణలతో సంచలనం సృష్టిస్తోంది. రెండున్నర కోట్ల వ్యూస్ ని అధిగమించేందుకు 48 గంటలు సరిపోతుందేమో అన్నంతగా దూసుకపోతోంది.

రాధే శ్యామ్ బీట్స్ కి మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం అదనపు ఆకర్షణగా నిలిచింది. జస్టిన్ ప్రభాకరన్ మనోహరమైన సౌండ్ ట్రాక్ ప్రధాన హైలైట్ గా నిలిచింది మోషన్ పోస్టర్ కి. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో రెబెల్ స్టార్ కృష్ణరాజు గోపికృష్ణ మూవీస్ – యువి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.