‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ మరియు రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న…!

0

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవ వీరుడు ‘కొమరం భీమ్’ గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు’ పాత్రలో కనిపిస్తున్నాడు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ – అలియా భట్ కూడా నటిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్స్ తిరిగి ప్రారంభిస్తున్నారు. అందులోనూ అక్టోబర్ 15 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని వెల్లడించారు.

రాజమౌళి మాట్లాడుతూ.. ”హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలని అనుకుంటున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ఎలా చేయాలనే దానిపై మేం చాలా హోం వర్క్ చేశాం. అవసరమైన జాగ్రత్తలను అనుసరించి షెడ్యూల్స్ ని రీ షెడ్యూల్ చేసాం. ఎవరు ఎలా షూటింగ్ కు రావాలనే దాని గురించి ప్లాన్ చేస్తున్నాం. కొన్ని చిన్న విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. ”ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ప్రీ వర్క్ ప్రెజర్ ఏమీ లేదని.. ప్రతి సినిమా విషయంలో సమస్యలుంటాయి. కరోనా సమయంలో అవి ఇంకా కాస్త ఎక్కువగా ఉంటాయి. దాని కోసం తలలు కొట్టేసుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతామనే దానిపై ఆలోచించి గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకోవాలి. మేం షూటింగ్ ఎలా చేస్తామనే దాన్ని అందరూ గమనిస్తారు. అందుకే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేయాల్సి ఉంటుంది. సిబ్బందిని తగ్గించే షూటింగ్ చేస్తాం. షూటింగ్ సమయంలో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అయితే వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళతాం” అని రాజమౌళి తెలిపారు.

‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ గురించి జక్కన్న మాట్లాడుతూ.. ”కరోనా ముందు నేను రిలీజ్ డేట్ చెప్పాను. కానీ ఇప్పుడు అలా చెప్పడం కష్టం. కొన్ని పద్ధతుల్లో షూటింగ్ చేయాల్సి ఉంది. అలా చేస్తున్నప్పుడు అనుకున్న సమయంలోనే షూటింగ్ చేస్తున్నానా అనేది చూసుకోవాలి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు రెండు నెలలు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఆ రెండు నెలలు షూటింగ్ అనుకున్నట్లు జరుగుతుందా లేదా అని చూసుకోవాలి. తర్వాతే రిలీజ్ డేట్ పై ఐడియా వస్తుంది” అని చెప్పారు.