బికినీ బీచ్ లో తెలుగమ్మాయి సరాగాలు

0

తేజస్వి మాదివాడ. .. ఈ తెలుగమ్మాయి గురించి పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వర్మ ఈ బ్యూటీని తెలుగుతెరపై కథానాయికగా అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసారు. తేజస్వి-ఆర్జీవీ కాంబో మూవీ ఐస్ క్రీమ్ విజయం సాధించకపోయినా తనకు నాయికగా మంచి అవకాశాలైతే తెచ్చి పెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు అందుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కథానాయిక ఫ్రెండుగా నటించిన తేజస్వి ఆ తర్వాత నాయికగా మెయిన్ స్ట్రీమ్ ఛాన్సులు అందుకోవడం కాన్ఫిడెన్స్ లెవల్స్ ని పెంచిందనే చెప్పాలి.

బిగ్ బాస్ – తెలుగులో ఇంటి సభ్యురాలిగానూ ఫాలోవర్స్ ని పెంచుకుంది. ఇటీవల సోషల్ మీడియాల్లో తేజస్వి స్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. రెగ్యులర్ ఫోటో ట్రీట్ తో విరుచుకుపడుతోంది. తాజాగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఓ ఫోటోని తేజస్వి మాదివాడ షేర్ చేసింది. బీచ్ లో రకరకాల భంగిమలతో ఫోటోషూట్ అదిరిపోయిందనే చెప్పాలి.

ఇక ఇంతకుముందు విక్టోరియా మహారాణి రేంజులో నాటి మేటి లగ్జరీ అంబాసిడర్ పై ఫోజులతో విరుచుకుపడింది. క్లాసిక్ ఫోజులతో మైమరిపించింది ఈ బ్యూటీ. ఇక రెగ్యులర్ ఫోటోషూట్ లతో ఈ భామ క్షణం తీరిక లేనంత బిజీగా ఉందని అర్థమవుతోంది. తేజస్వి ప్రస్తుతం మీటూ ఉద్యమం నేపథ్యంలో ఓ చిత్రంలో నటిస్తోంది. పలు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకోనుందని సమాచారం.