కరోనా మహమ్మారిని జయించిన దర్శకధీరుడు…!

0

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కి ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న రాజమౌళి కరోనా మహమ్మారిని జయించి బయటపడ్డారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కరోనాను జయించారు. రెండు వారాల హోమ్ క్వారంటైన్ పూర్తి అవ్వడంతో వీరందరూ మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో అందరికీ నెగిటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ.. ”రెండు వారాల క్వారంటైన్ పూర్తయింది. లక్షణాలు ఏమీ లేవు. దీని కోసం పరీక్ష చేయించుకోగా మా అందరికి నెగిటివ్ వచ్చింది. ప్లాస్మా దానం చేయడానికి మమ్మలి మరో మూడు వారాలు వేచి ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అప్పటి వరకు శరీరంలో అవసరమైన యాంటీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తాం” అని చెప్పుకొచ్చారు. రాజమౌళి మరియు అతని ఫ్యామిలీ కరోనా నుండి కోలుకోవడంతో అందరూ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. రాజమౌళిని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.