స్టార్ హీరోయిన్ మళ్లీ తల్లి కాబోతుంది

0

బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ ఖాన్ లు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. వీరిద్దరు మూడు సంవత్సరాల క్రితం తైమూర్ కు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆ బాలుడు పెద్ద వాడు అవుతూనే ఉన్నాడు. అతడికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. తైమూర్ కాస్త పెద్దవాడు అవ్వడంతో ఈమద్యే కరీనా కపూర్ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అప్పుడే ఆమె మళ్లీ తల్లి కాబోతుంది అంటూ వార్తలు రావడం మొదలయ్యాయి.

చాలా మంది ఆ వార్తలు నిజం కాదనుకున్నారు. కరీనా కపూర్ తండ్రి రణదీర్ కపూర్ కూడా మీడియాలో వస్తున్న ఆ వార్తలు నిజం అయితే బాగుండు. తైమూర్ కు చెల్లి లేదా తమ్ముడు రావాలని నేను కూడా అనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు. రణదీర్ కపూర్ సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే సైఫ్ అలీ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో తమ ఫ్యామిలీలోకి మరొకరు రాబోతున్నారు.

అభిమానులకు మరియు బంధు మిత్రులకు కృతజ్ఞతలు అంటూ సైఫ్ పోస్ట్ పెట్టాడు. సైఫ్ అలీ ఖాన్ పోస్ట్ తో కరీనా కపూర్ రెండవ సారి తల్లి కాబోతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈమె అమీర్ ఖాన్ తో లాల్ చద్దా చిత్రంలో నటిస్తోంది. ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. మరి ఈ సమయంలో ఆమె ఎలా మేనేజ్ చేయనుందో చూడాలి.