రాజశేఖర్ కూతురు ఎమోషనల్ పోస్ట్

0

కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచి పెట్టడం లేదు. చిన్నా పెద్దా .. ముసలి ముతక అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ పట్టి పీడిస్తోంది. గత కొంత కాలంగా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. 99 శాతం మంది సేఫ్ గా కోలుకుని బయటపడుతున్నారు. ఎక్కడో ఒక్కరిద్దరు మాత్రమే కరోనా దెబ్బకు బలైపోతున్నారు.

ఇటీవల బండ్ల గణేష్ నుంచి తమన్నా వరకు టాలీవుడ్ లో కరోనా బారిన పడి కోలుకున్న వారే ఎక్కువ శాతం మంది వున్నారు. కొంత మంది కోలుకుని ప్లాస్మాని కూడా దానం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే ఇటీవల యంగ్రీయంగ్ మెన్ డా. రాజశేఖర్ ఫ్యామిలీ కరోనా బారిన పడటం పలువురిని షాక్కు గురిచేసింది. తనతో పాటు భార్య జీవిత.. పిల్లలు శివాని.. శివాత్మిక కరోనా బారిన పడ్డామని అయితే కోవిడ్ నుంచి శివాని .. శివాత్మిక కోలుకున్నారని రాజశేఖర్ స్పష్టం చేశారు.

తాజాగా ఆయన కుమార్తె శివాత్మిక సోషల్మీడియా ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన కలిగిస్తోంది. ప్రియమైన అందరికి కోవిడ్ తో నాన్నా పోరాటం చాలా కష్టంగా వుంది. అయినప్పటికీ ఆయన గట్టిగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు ప్రేమే మమ్మల్ని కాపాడాయని మేము నమ్ముతున్నాము. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ఇక్కడ కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలతో నాన్న బలంగా తిరిగి బయటకు వస్తాడు` అని శివాత్మిక పెట్టిన పోస్ట్ పలువురిని భావోద్వేగానికి గురిచేస్తోంది.