పెద్ద సాహసమే చేయబోతున్న రకుల్

0

కరోనా కారణంగా దాదాపు ఆరు నెలలుగా సినిమాల షూటింగ్ జరగడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. స్టార్ హీరోలు హీరోయిన్స్ డబ్బు సంపాదించడం ఏమో కాని ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ కు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నా కూడా హీరోలు హీరోయిన్స్ మాత్రం బాబోయ్ మేము రాము అంటున్నారు. ఇప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ ఎవరు సినిమా షూటింగ్ కు హాజరు కాలేదు.

ఒక్కటి రెండు రోజులు యాడ్ షూటింగ్ లేదంటే మరేదైనా షూటింగ్ కు హాజరు అవుతున్నారు తప్ప సినిమా షూటింగ్స్ లో హాజరు అవ్వడం లేదు. ఒక వేళ చేసినా కూడా విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తున్నారు తప్ప ఇండియాలో మాత్రం కరోనా భయంతో షూటింగ్ కు రెడీ అవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ కపూర్ మరియు జాన్ అబ్రహం నటిస్తున్న సినిమా షూటింగ్ ను ముగించేందుకు సిద్దం అవుతున్నారు. రెండు వారాల షూటింగ్ బ్యాలన్స్ ఉండగా కరోనా వల్ల ఆగిపోయింది. ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు ముంబయిలోని ఒక స్టూడియోలో షూటింగ్ చేస్తున్నారు. రెండు వారాల పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా షూటింగ్ లో పాల్గొనబోతుంది. చాలా నెలల తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. కరోనా కారణంగా అనేక జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత ఈ షూటింగ్ ను మొదలు పెట్టారట. అయితే కరోనా సమయంలో షూటింగ్ అంటే చాలా పెద్ద సాహసం. సౌత్ ఇండియాకు చెందిన స్టార్ హీరోయిన్స్ లో రకుల్ మాత్రమే షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది. ఈమె చేయబోతున్నది పెద్ద సాహసం.