పాలరాతి శిల్పంకు జీవం వచ్చినట్లుంది

0

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈమద్య కాలంలో కాస్త కళ తప్పినట్లయ్యింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాలతో స్టార్ డం దక్కించుకుంది. ప్రస్తుతం సినిమాలు చేయకున్న కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. రెగ్యులర్ గా తన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉండే రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. థ్రూబ్యాక్ ఫొటో అంటూ రకుల్ షేర్ చేసిన ఈ ఫొటో ప్రస్తుం వైరల్ అవుతోంది.

వైట్ డ్రస్ లో థైస్ చూపిస్తూ నవ్వులు పూయిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కు ఆమె ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ ఆమె పోస్ట్ కు వేలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో ఒక సినిమాకు చర్చలు జరుపుతోంది. ఇదే సమయంలో ఒక హిందీ వెబ్ సిరీస్ ను కూడా ఈమె చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తప్పకుండా మళ్లీ పుంజుకుని బిజీ అవుతాను అనే నమ్మకంతో రకుల్ ఉంది. మరి ఆమెను సినీ జనాలు పట్టించుకునేనా చూడాలి.