బీచ్ యోగాలో రకుల్ పరేషానులే..!

0

రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవుల విహారం ప్రస్తుతం ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒంటరి దీవుల్లో బికినీ బీచ్ సెలబ్రేషన్ తో అగ్గి రాజేస్తోంది ఈ పంజాబీ బ్యూటీ. ఇప్పటికే డజను మంది కథానాయికలు ఇదే బీచ్ లో సెలబ్రేషన్స్ జరుపుకోవడం ఆసక్తికరం. సాటి నాయికలకు ఏమాత్రం తగ్గకుండా విజువల్ ఫెస్ట్ కి సిద్ధమైంది రకుల్.

నిన్నటిరోజున బికినీ బీచ్ లో రకరకాల భంగిమల్ని ప్రదర్శిస్తున్న ఫోటోల్ని షేర్ చేసింది. తన సోదరుడు అమన్ తో కలిసి ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. తాజాగా నెవ్వర్ బిఫోర్ అనిపించే యోగా ఫోటోని రకుల్ షేర్ చేసింది.

శుక్రవారం రాత్రి ఈ ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. బీచ్ లో తన వ్యాయామ సెషన్ కి సంబంధించిన రేర్ ఫోటో ఇది. నెవ్వర్ మిస్ వర్కవుట్.. వేకే వైబ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ లను జోడించింది. నా విటమిన్ డి మోతాదును సముద్రం ద్వారా పొందుతున్నా! అంటూ రకుల్ వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ చక్రాసన యోగా ఫీట్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

ఇంతకుముందు షేర్ చేసిన ఫోటోలకు ఆకర్షణీయమైన క్యాప్షన్ నే ఇచ్చింది. “సముద్ర వాసన.. ఆకాశం అనుభూతి .. ఆత్మను ఎగరనివ్వండి“ అంటూ కవితలు అల్లింది రకుల్. ఇక కెరీర్ సంగతి చూస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ తదుపరి ఇంకా టైటిల్ నిర్ణయించని సరిహద్దు ప్రేమ కథలో కనిపించనుంది. ఈ చిత్రంలో అర్జున్ కపూర్ హీరో. జాన్ అబ్రహం – అదితి రావు హైదరి కీలక పాత్రల్లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల `మేడే` అనే మరో చిత్రానికి సంతకం చేసింది. ఆసక్తికర థ్రిల్లర్-డ్రామా మేడేలో ఈ నటి పైలట్ పాత్రను పోషించనుంది. ఈ చిత్రానికి ఆమె `ది దే ప్యార్ దే` సహనటుడు అజయ్ దేవ్గన్ దర్శకత్వం వహించి నిర్మిస్తారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నారు. యారియాన్-అయ్యారి-మర్జవాన్ లాంటి చిత్రాల్లో రకుల్ నటించిన సంగతి తెలిసిందే.