సగం తగ్గిన రకుల్

0

టాలీవుడ్ లోని దాదాపు యంగ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు మూడు సంవత్సరాల పాటు టాలీవుడ్ లో నెం.1 గా రికార్డు స్థాయి పారితోషికం తీసుకంఉటూ మరీ బిజీ బిజీగా కొనసాగింది. అయితే అమ్మడి క్రేజ్ మూడు నాళ్ల ముచ్చటే అయ్యింది. గత రెండేళ్ల కాలంగా కంగనాకు పెద్దగా ఆఫర్లే లేకుండా అయ్యాయి. గతంలో కోటికి మించి పారితోషికం తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేసింది. కాని ఇప్పుడు పారితోషికం సగం చేసుకున్నా కూడా ఏడాదికి ఒకటి రెండు సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదట.

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్న పేరున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం. ఆ సినిమా షూటింగ్ గత వారంలో వికారాబాద్ ఫారెస్ట్ లో ప్రారంభం అవ్వాల్సి ఉండగా యూనిట్ సభ్యుల్లో ఒకరికి కరోనా రావడంతో షూటింగ్ వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ రకుల్ వెయిట్ చేస్తుందట. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మళ్లీ తన క్రేజ్ ను నిరూపించుకునేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది.

ఈ సినిమా కోసం రకుల్ తీసుకున్న పారితోషికం చాలా తక్కువగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె గతంలో తీసుకున్న పారితోషికంలో ఈ సినిమాకు తీసుకుంటున్న పారితోషికం సగం కూడా లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. పారితోషికం విషయంలో పట్టింపు లేకుండా మెగా హీరో మూవీ అదీను క్రిష్ దర్శకత్వంలో మూవీ అనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను చేసేందుకు రకుల్ వెంటనే ఒప్పుకుందట. ఆమె కోరుకున్నట్లుగా మళ్లీ కోట్ల నెంబర్ కు చేరుకోగలదా అనేది చూడాలి.