రియా అరెస్టుపై తాప్సీ ఏమందంటే?

0

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్టుపై ఒక్కొక్కరూ ఒక్కో తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో తాప్సీ పన్ను.. శేఖర్ సుమాన్.. అంకిత లోఖండే.. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తదితరులు ఉన్నారు.

పలువురి అభిప్రాయాల్లో డివైడ్ ఫ్యాక్టర్ కనిపించింది. మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో రియా చక్రవర్తిని అరెస్టు చేయడంపై బాలీవుడ్ డివైడ్ అయిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ భాగస్వామి అంకితా లోఖండే కర్మ గురించి నిగూడమైన పోస్ట్ తో ఈ చర్యను ప్రశంసించగా… శేఖర్ సుమన్ దీనిని ‘పెద్ద విజయం’ అని పొగిడారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి- శ్వేతా సింగ్ కీర్తి ప్రియాంక సింగ్ కూడా రియా చక్రవర్తి అరెస్టు సరైనదేననే సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గాడ్ ఈజ్ విత్ అజ్! అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

మాదకద్రవ్యాల సరఫరాదారులతో సంబంధం ఉన్న రియా అరెస్టుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొంతమంది ప్రముఖుల్లో తాప్సీ పేరు ప్రముఖంగా వినిపించింది. రియా చక్రవర్తిని ఎన్.సి.బి కస్టడీకి తీసుకోవడంఐ వ్యతిరేకంగా తాప్సీ పన్నూ తీవ్రంగా దాడికి దిగింది. కుబ్రా సైట్ కూడా నటి ఆమె కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించింది.

రియా చక్రవర్తి న్యాయవాది సతీష్ మన్షిందే అతహశుడయ్యారు. ఆ అరెస్టుపై నిందలు వేసి… ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అని ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. “సెంట్రల్ ఏజెన్సీలు ఒంటరి స్త్రీని వేధించాయి.. ఎందుకంటే ఆమె మాదకద్రవ్యాల బానిసతో ప్రేమలో పడడమే దానికి కారణం. చాలా సంవత్సరాలు మానసిక ఆరోగ్య సమస్యలతో సుశాంత్ బాధపడ్డాడు. ముంబైలోని 5 ప్రముఖ మానసిక వైద్యుల సంరక్షణలో చట్టవిరుద్ధంగా నిర్వహించబడుతున్న మందుల వినియోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు“ అని వ్యాఖ్యానించారు.