నాగార్జున గారు ఏంటి సార్ మాకు ఈ శిక్ష

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం అయ్యింది. మొదటి మూడు సీజన్ లను మించి ఈ సీజన్ ఉంటుందంటూ మొదటి నుండి నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ విషయం ఏమో కాని గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్లో ఏడుపులు మరీ ఎక్కువ అయ్యాయి. ఇక ముద్దుగుమ్మల థైస్ అందాలు రచ్చ చేస్తున్నాయి. అంతగా థైస్ చూపిస్తే మేల్ కంటెస్టెంట్స్ పరిస్థితి ఏం కావాలో వారు కనీసం అర్థం చేసుకోలేక పోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్బాస్ అంటే మీమ్స్ చాలా కామన్. కాని ఈసారి మీమ్స్ మొదటి రోజు నుండే మొదలయ్యాయి.

మొదటి సీజన్ నుండి మొదలుకుని ప్రతి సీజన్ లో ఒకరు ఏడుపుగొట్టువాళ్లు ఉంటూనే ఉన్నారు. మొదటి సీజన్ లో మధుప్రియ తర్వాత దీప్తి సునయన మూడవ సీజన్ లో శివ జ్యోతి. ఈ ముగ్గురిపై ఏ స్థాయిలో మీమ్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వారిని మించి మోనాల్ ఆ పేరును దక్కించుకుంది. బాబోయ్ ఏంటీ మాకు ఈ శిక్ష అన్నట్లుగా మోనాల్ ఏడుపును ప్రేక్షకులు విసుక్కునేలా ఆమె ఏడుపు ఉంది. మొదటి మూడు సీజన్ ల ముగ్గురు తెలుగు వారే అవ్వడం వల్ల వారి ఏడుపు అర్థం అయ్యేది. కాని ఇప్పుడు మోనాల్ ఏడుపు కనీసం అర్థం కూడా కావడం లేదు. ఆమె ఎందుకు ఏడుస్తుందో షో ను కంటిన్యూగా చూస్తున్న వారికి అర్థం అవ్వడం లేదు.

ఆమె ఏడుపుకు కారణం ఏంటో కూడా తెలియక ప్రేక్షకులు జుట్టు పీక్కుంటున్నారు. ఇక షో లో ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి అయినా ఆసక్తికర చర్చ జరగలేదు. ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటూ ఉంటే కంటెస్టెంట్స్ మాత్రం బోర్ కొట్టేస్తున్నారు. అందుకే దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన పాపులర్ డైలాగ్ నాగార్జున గారు ఏంటి సార్ మాకు ఈ శిక్ష మీమ్ బాగా వైరల్ అవుతోంది.