గుండె గుభేల్మనేలా వ్వాటే లుక్ రాశీ

0

దిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా హైదరాబాద్ లో స్థిరపడిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ బ్యూటీ తెలివైన ఎంపికలతో కెరీర్ సాగిస్తోంది. ఆటుపోట్లు ఎదురైనా యువహీరోల ఆదరణతో రాశీకి అవకాశాలొస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుణ్ తేజ్.. సాయి తేజ్ అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు. ఇక అవసరాల శ్రీనివాస్ లాంటి స్నేహితుడు డెబ్యూ ఛాన్స్ ఇవ్వడమే గాక.. వీలున్న ప్రతిసారీ రాశీ ఖాన్నాకు మంచి బ్యానర్లలో అవకాశాల కోసం సాయం చేశారన్న సంగతి విధితమే.

ఇక సోషల్ మీడియాల్లో రాశీ ఖన్నా జరంత స్పీడ్ గానే ఉంది. ఇటీవల లాక్ డౌన్ పీరియడ్ లో రెగ్యులర్ ఫోటో ట్రీట్ తో ఆకట్టుకున్న రాశీ.. ప్రస్తుతం షూటింగుల నిమిత్తం విమాన ప్రయాణాలు చేస్తోంది. ముంబై – దిల్లీ- హైదరాబాద్ అంటూ విమానయానం చేస్తోంది. తెలుగుతో పాటు తమిళం హిందీలో అవకాశాల కోసం గాలం వేస్తోందిట.

తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఇదిగో ఇలా ఎయిర్ పోర్ట్ లుక్ తో కనిపించింది. పక్కా స్పోర్ట్ లుక్ తో రాశీ అగ్గి రాజేసింది. ఎల్లో టాప్ బ్లాక్ ఇన్నర్.. బ్లాక్ స్పోర్ట్ ట్రాక్ లో కనిపించి గుండె గుభేల్ మనిపించింది. ఇక కోవిడ్ విలయాన్ని దృష్టిలో పెట్టుకుని మాస్క్ ని ధరించి విమానాశ్రయంలో అడుగు పెట్టింది. ఇతర నిబంధనలు పాటించింది. ప్రస్తుతం రాశీ ఆరణ్మయి 3.. సైతాన్ కా బచ్చా అనే చిత్రాల్లో నటిస్తోంది.