Templates by BIGtheme NET
Home >> Cinema News >> లాక్ డౌన్ చెర్రీ మైండ్ సెట్ మార్చేసిందా?

లాక్ డౌన్ చెర్రీ మైండ్ సెట్ మార్చేసిందా?


టాలీవుడ్ లో అగ్ర నిర్మాతలంతా పరిమిత బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నవతరం హీరోలు కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తున్నారు. క్రియేటివ్ కంటెంట్ తో వస్తే ఎంకరేజ్ చేస్తున్నారు. స్క్రిప్టులో దమ్ము చూపిస్తే అవకాశం ఖాయం చేసుకున్నట్టే.

దిల్ రాజు .. డి.సురేష్ బాబు.. అల్లు అరవింద్ .. యువి అధినేతలు .. ఈ తరహా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. కానీ కొణిదెల అధినేత రామ్ చరణ్ మాత్రం కేవలం భారీ బడ్జెట్ చిత్రాల్ని నిర్మించేందుకే బ్యానర్ ని ప్రారంభించానని అప్పట్లో చెప్పారు. పైగా తన తండ్రితో మాత్రమే నిర్మాతగా సినిమాలు తీస్తానని అన్నారు.

కానీ ఇటీవల ఆలోచన మారింది. ఓవైపు కొణిదెల బ్యానర్ లో పెద్ద సినిమాలు తీస్తూనే .. ఇప్పుడు ఇతర బ్యానర్లలో నవతరం ట్యాలెంటుకు అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. చిన్న బడ్జెట్ సినిమాల్ని నిర్మించే యోచన చేస్తున్నారట. హీరోగా బిజీగా ఉన్నా.. చరణ్ స్వయంగా తన ప్రొడక్షన్ హౌస్ ను చూసుకుంటాడు. చరణ్ తన కెరీర్ పై దృష్టి పెట్టడానికి సమయం లభించకపోవడంతో అనేకమంది ఇతర నిర్మాతలు చిరుతో సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారట. అయితే చరణ్ మాత్రం నిర్మాతగా బిజీ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇందులో కొంత నిజం ఉంది. సొంత బ్యానర్ అభివృద్ధి కోసం చరణ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ హీరోలతోనే కాకుండా ఇతర హీరోలతోనూ చరణ్ సినిమాలు చేయాలనుకుంటున్నారట.

కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలను రూపొందించడానికి .. కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఈ లాక్ డౌన్ సమయంలో చరణ్ చాలా మంది యువ దర్శకుల నుండి చాలా మంచి కంటెంట్ (స్క్రిప్టులు) విన్నాడు. రాబోయే రోజుల్లో వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారట. చెర్రీ మైండ్ సెట్ ఉన్నట్టుండి మారిందా? .. కరోనా మార్చిందా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.