చరణ్ ఇవ్వబోతున్న సడెన్ ట్విస్టు ఇదే

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RRR కోసం అభిమానులు పడిగాపులు పడుతున్నారు. కోవిడ్ వల్ల షూటింగ్ తో పాటు రిలీజ్ ఆలస్యమవుతోంది. చిత్రీకరణ ముగించినా భారీ గా గ్రాఫిక్స్ పనులు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూవీతో పాటు ఆచార్య చిత్రీకరణ ఆలస్యమవ్వడం చరణ్ కి ఇబ్బందికరంగా మారింది.

అయితే ఆ రెండిటినీ మరిపించేలా మరో కొత్త ప్రకటన చరణ్ నుంచి రాబోతోందా? అంటే అవుననే సమాచారం. ఇప్పటికే చిరంజీవి కథానాయకుడిగా పలు రీమేక్ లపై ఆలోచిస్తున్న చరణ్ తదుపరి తాను నటించే సినిమా విషయమై ప్రకటన చేయనున్నారట. అదేమిటి అంటే…!

రామ్ చరణ్ – వెంకి కుడుముల ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకూ రాలేదు. కానీ ఇక ఆ సస్పెన్స్ కి తెర దించేసే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారట. అయితే అంతకుముందే రికార్డింగ్ కార్యక్రమాలు మొదలెట్టే వీలుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చెర్రీతో వెంకి కుడుముల అలయెన్స్ ఇప్పటిది కాదు. ఇంతకు ముందు రామ్ చరణ్ నటించిన రీమేక్ మూవీ `తుఫాన్` రచయితలలో ఒకరిగా పనిచేశారు. ఛలో హీరో నాగశౌర్యతో వెంకీ కుడుముల గొడవ పడినా కానీ ఆ తర్వాత భీష్మతో అన్నిటినీ చెరిపేశాడు. ఇప్పుడు చరణ్ తో ఆఫర్ ని ఖాయం చేసుకున్నాడు. దసరా కి ప్రకటించేస్తే అతడు మరో మెట్టు పైకి ఎక్కేసినట్టే.