బహుబాష నటికి నోటీసులు..!

0

బాలీవుడ్ యువ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్బంలో చాలామంది గుండెల్లో గుబులు మొదలైంది. సుశాంత్ కు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాలీవుడ్ నుంచి స్యాండిల్ వుడ్ వరకు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నటి అనికాను అరెస్టు చేసిన అధికారులు అనేక మందికి నోటీసులు ఇచ్చారు. స్యాండిల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ తదితర బాషల్లో నటించిన ప్రముఖ నటికి విచారణకు హాజరుకావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చారు .అయితే అనారోగ్య కారణంగా తాను విచారణకు హాజరుకాలేనని ఆ నటి న్యాయవాదులతో సమాచారం ఇచ్చారు. అయితే ప్రముఖ నటి వ్యక్తిగత సహాయకుడు ఇప్పటికే సీసీబీ పోలీసుల చేతికి చిక్కడంతో విచారణ చేశారు.

సుశాంత్ కేసు విషయంలో డ్రగ్స్ మాఫియా దందా ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన క్రమంలో ముంబాయిలో ఎన్ సీబీ అధికారులు రెహమాన్ అనే డ్రగ్ డీలర్ ను అరెస్టు చేశారు. రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరులో నటి అనికాతో సహ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నటి అనికా ఇచ్చిన సమాచారం మేరకు పలువురు సెలబ్రిటీల గుండెల్లో దడ మొదలైంది. బెంగళూరులో నివాసం ఉంటూ పలు సీరియల్స్ లో నటిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అనికా అరెస్టు కావడం ఆమె మొబైల్ ఫోన్లలో అనేక మంది సెలబ్రిటీల ఫోన్ నెంబర్లు ఉండటంతో పలుకోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు

ఇదే సమయంలో స్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు నటీనటులపై బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు నిఘా వేశారని సమాచారం. స్యాండిల్ వుడ్ తో పాటు తెలుగు తమిళ తదితర బాషల్లో నటించిన ప్రముఖ నటి రాగిణి ద్వివేది వ్యక్తిగత సహాయకుడు రవిశంకర్ ను బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణ చేశారు. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలని ప్రముఖ నటి రాగిణి ద్వివేదికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చెయ్యడంతో అలజడి రేగింది. బెంగళూరు సీసీబీ పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా నటి రాగిణి ద్వివేది విచారణకు అధికారులకి ముందుకు రాలేదు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని విచారణకు హాజరుకావడానికి సమయం కావాలని ప్రముఖ నటి రాగిణి ద్వివేది ఆమె న్యాయవాదుల సహాయంతో గురువారం బెంగళూరు సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే తన న్యాయవాదులు బెంగళూరు సీసీబీ పోలీసులను కలిసి విషయం చెప్పారని గురువారం ప్రముఖ నటి రాగిణి ద్వివేది సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. బెంగళూరు సీసీబీ పోలీసుల ముందు తాను సోమవారం ఉదయం హాజరౌతానని అధికారుల విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని బ్యూటీ రాగిణి క్లారిటీ ఇచ్చారు