Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాస్ ఇండియాలోనే ది బెస్ట్ హీరోనా?

ప్రభాస్ ఇండియాలోనే ది బెస్ట్ హీరోనా?


బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత! అన్న తీరుగా ఇండియన్ సినిమా దిశానిర్ధేశనం మారిపోయిందని చెప్పొచ్చు. భారతీయ సినిమా అందులో అంతర్భాగం అయిన టాలీవుడ్.. కోలీవుడ్ .. శాండల్వుడ్ ఇతరపరిశ్రమలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మేం తోపులం అని చెప్పుకునే బాలీవుడ్ ఇప్పటికే ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడుతోంది. హిందీ స్టార్లు సౌత్ సినిమాని అనునిత్యం తరచి చూడడం అలవాటుగా మార్చుకున్నారంటే.. మనం ఒక మెట్టు పైనున్నామనే దానర్థం.

అయితే స్టార్ హీరోల పరంగా చూస్తే.. ఇప్పుడున్న స్టార్లలో ఖాన్ ల త్రయం సల్మాన్ – అమీర్ – షారూక్ ఈ ముగ్గురే దేశంలో నంబర్ వన్ హీరోలుగా వెలిగారు ఇన్నాళ్లు. వీళ్లను బీట్ చేస్తూ అక్షయ్ కుమార్ లాంటి స్టార్ రేస్ లో స్టడీగా వెళుతున్నాడు. రణవీర్ సింగ్ – రణబీర్ లాంటి వాళ్లకి ఆ తర్వాత స్థానం దక్కుతోంది. అయితే సౌత్ నుంచి వచ్చిన డార్లింగ్ ప్రభాస్ మాత్రం వీళ్లందరికీ ఠఫ్ కాంపిటీటర్ గా మారాడా? అన్న చర్చ అనునిత్యం అభిమానుల్లో సాగుతూనే ఉంది.

ఉన్నఫలంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టుల్ని ప్రకటిస్తూ.. ప్రభాస్ వేడి పెంచేస్తున్నాడు. నాగ్ అశ్విన్ తో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వం ఆదిపురుష్ 3డి ఇప్పటికే అగ్గి రాజేస్తున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ కి ఇది పెద్ద ప్లస్ అవుతోంది. వరుసగా మూడు ప్రాజెక్టులు క్యూలో ఉండగానే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్టును ప్రకటించనున్నాడని వార్తలొస్తున్నాయి. అంటే నాలుగు పాన్ ఇండియా సినిమాలతో అతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఖాన్ ల త్రయానికే లేవ్ అన్ని ప్రాజెక్టులు. సక్సెస్ కూడా వీళ్లను వదిలి పోయింది ఎప్పుడో.

ఇలా అయితే ప్రభాస్ కి సరైన కాంపిటీటర్ ఎవరై ఉంటారు? అన్నది వెతికితే ఎవరూ ఆ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. అటు ఖాన్ లు సైతం చేతులెత్తేశారు. ఒకటీ అరా సినిమాలు తీస్తున్నారు తప్ప స్పీడ్ అయితే లేదు వీళ్లలో. ఇక ఇటు టాలీవుడ్ లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం రీఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ హీటెక్కిస్తున్నారు. పింక్ రీమేక్ వకీల్ సాబ్ తర్వాత వరుసగా నాలుగు సినిమాల్ని క్యూలో పెట్టారు. క్రిష్.. హరీష్ శంకర్ .. సురేందర్ రెడ్డి.. వీళ్లంతా క్యూలో ఉండడం చూస్తుంటే అతడే సరైన కాంపిటీటరా? అంటూ చర్చ సాగుతోంది. మహేష్.. చరణ్.. బన్ని లాంటి హీరోలు ఒక్కో సినిమాతో నెమ్మదిగా బండి లాగిస్తున్నారు. వీళ్లంతా ప్రభాస్ తో పోలిస్తే స్లోగానే ఉన్నారు. ఒకటీ అరా చర్చల దశలో ఉన్నా.. వీటి విషయంలో చాలా ఆలస్యమయ్యేట్టే ఉంది. ఇక ఈ రేసులో ప్రభాస్ .. పవన్ లతో పోటీపడుతూ తారక్ మాత్రం సైలెంటుగా బ్లాక్ బస్టర్ దర్శకుల్ని క్యూలో పెట్టేయడం చర్చకొస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఎక్కడా తన స్టామినా తగ్గనీకుండా 60 ప్లస్ ఏజ్ లోనూ హార్డ్ వర్క్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.