స్టైలిష్ పవర్ స్టార్ తో క్యూట్ మహానటి

0

పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో చాలా మందికి కూడా అభిమానం. హీరోలు హీరోయిన్స్ ఎంతో మంది పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తూ ఉంటారు. ఒక్క సారి ఆయనతో వర్క్ చేసిన ఎవరైనా ఆయన గురించి ఎప్పటికి మాట్లాడుతూనే ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అజ్ఞాతవాసి సినిమాకు గాను పవన్ తో నటించే అవకాశంను దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్. ఈ అమ్మడు పవన్ బర్త్ డే సందర్బంగా గతంలో ఎప్పుడు ఎవరు చూడని ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫొటోలో పవన్ షూటింగ్ గ్యాప్ లో ఫోన్ లో ఏదో సీరియస్ గా చూస్తున్నట్లుగా ఉండగా.. పవన్ వైపు చాలా క్యూరియాసిటీతో అతడి నుండి ఏదో విలువైన విషయాన్ని తెలుసుకుంటున్నట్లుగా కీర్తి సురేష్ చూస్తుంది. పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసే అవకాశం రావడంతో కీర్తి సురేష్ లక్ తిరిగి పోయింది అనడంలో సందేహం లేదు. మహానటికి ముందే పవన్ తో సినిమా చేసింది. అయితే అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది. అయినా కూడా ఆ సినిమాతో కీర్తి సురేష్ కు మంచి మైలేజ్ అయితే దక్కింది.

ఆ సినిమాకు గాను సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని అలరించిన కీర్తి సురేష్ అదే ఉత్సాహంతో మహానటి చేసి సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. అందుకే పవన్ కళ్యాన్ అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం ఇలా పుట్టిన రోజున అన్ సీన్ ఫొటోతో షేర్ చేసుకుంది. ఫొటోలో కీర్తి చాలా క్యూట్ గా ఉందని.. పవన్ చాలా స్టైలిష్ గా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.