చిరు మూవీని పొరపాటున కన్ఫర్మ్ చేసిన పవన్

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచి పోయిన ఆచార్య త్వరలో పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది చిరంజీవి కొత్త సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొన్నటి వరకు మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ ను రీమేక్ చేస్తారని ప్రచారం జరిగింది. కాని అంతకు ముందు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఒక రీమేక్ ను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు చిరంజీవి ఫ్యాన్స్ ను గత కొన్ని రోజులుగా కలవర పెడుతున్నాయి.

మెహర్ రమేష్ అట్టర్ ఫ్లాప్ సినిమాలు వరుసగా తీశాడు. దాంతో పదేళ్లుగా అతడికి కనీసం ఒక్కటి అంటే ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. దాంతో కథ చర్చలు మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఇతర దర్శకులకు సాయంగా ఉంటున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు చిరంజీవిని ఒప్పించిన మెహర్ రమేష్ సినిమా చేయబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలను చాలా మంది నమ్మలేదు. ప్రస్తుం ఆయన ముందు ఎంతో మంది దర్శకులు ఉండగా మెహర్ రమేష్ నే ఎందుకు చిరు ఎంపిక చేసుకుంటాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

అనుమానాలను పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. నిన్న పవన్ పుట్టిన రోజుకు మెహర్ రమేష్ శుభాకాంక్షలు తెలియజేశాడు. అందుకు రిప్లైగా పవన్ కళ్యాణ్ స్పందించాడు. థ్యాంక్యూ రమేష్. నీవు చేయబోతున్న చిరంజీవి గారి మూవీకి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో ఇన్ని రోజులు అనుమానంగా ఉన్న చిరంజీవి.. రమేష్ ల మూవీ కన్ఫర్మ్ అయ్యింది. ఇటీవల చిరంజీవి ‘ఆచార్య’ టైటిల్ ను పొరపాటున ఇలాగే ప్రకటించారు. ఇప్పుడు పవన్ కూడా చిరు.. మెహర్ రమేష్ ల మూవీ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడు. ఇక చిరు.. మెహర్ రమేష్ ల అఫిషియల్ అనౌన్స్ మెంట్ తరువాయి.