‘ఆదిపురుష్’ లో సీతగా లస్ట్ బ్యూటీని యాక్సెప్ట్ చేస్తారా…?

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ”ఆదిపురుష్” అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘చెడుపై మంచి సాధించిన విజయం’ అనే థీమ్ తో రానున్న ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ పోస్టర్ ని చూసిన సినీ అభిమానులకు ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడని అర్థం అయింది. అయితే అప్పటి నుంచి ‘రావణాసురుడు’ ‘సీత’ పాత్రలు ఎవరు పోషిస్తారనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆది పురుష్’లో ప్రభాస్ ని ఢీకొట్టే ప్రతినాయకుడు ‘లంకేష్’ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా ఇప్పుడు ‘సీత’ పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్.. ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే కియారా అద్వానీని ఉత్తమురాలైన సీత పాత్రలో అంగీకరిస్తారా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే కియారా ఇంతకముందు ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించడంతో పాటు వైబ్రేటర్ సీన్ లో కూడా నటించి అందరిని షాక్ కి గురి చేసింది. అంతేకాకుండా ‘గిల్టీ’ ఒరిజినల్ మూవీలో డ్రగ్స్ తీసుకుంటూ సిగరెట్స్ మందు తాగే అమ్మాయిగా కనిపించింది. అలాంటి పాత్రల్లో నటించిన కియారా ని ఇప్పుడు ‘సీత’ పాత్రలో యాక్సెప్ట్ చేస్తారా అని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం నటీనటులు ఎలాంటి పాత్రల్లో అయినా నటిస్తారని.. అది వారి వృత్తి ధర్మం అని.. అప్పుడు బోల్డ్ గా నటించినట్లే ఇప్పుడు సాంప్రదాయ బద్దమైన పాత్రలో నటిస్తే తప్పేంటని కామెంట్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా మూవీగా రానున్న ‘ఆదిపురుష్’ లో మేకర్స్ హీరోయిన్ గా ఎవరికి ఓటేస్తారో చూడాలి.