చరణ్ ఆ ఇద్దరి విషయం ఇంకా తేల్చలేదు

0

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ మరియు చరణ్ లు ఇప్పటికే రెండు సంవత్సరాలు కేటాయించారు. మరో ఆరు నెలల వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకే వారు పని చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కరోనా కారణంగా అదనపు సమయంను వీరిద్దరు ఆర్ఆర్ఆర్ కోసం కేటాయించాల్సి వచ్చింది. ఇక ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ మూవీకి ఓకే చెప్పాడు. ఆ సినిమా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ ను ఎన్టీఆర్ ఎప్పుడు ముగించుకుని వస్తాడా అంటూ త్రివిక్రమ్ ఎదురు చూస్తున్నాడు. అయితే చరణ్ మాత్రం ఇంకా తర్వాత సినిమా విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య చిత్రంలో చిన్న పాత్రను చేయబోతున్నాడు. అంతే తప్ప మరో సినిమా విషయంలో క్లారిటీ లేదు. చరణ్ కు ఇప్పటికే యంగ్ డైరెక్టర్స్ సందీప్ వంగ మరియు గౌతమ్ తిన్ననూరిలు కథలు చెప్పారట. ఇద్దరి కథలను విన్న చరణ్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడంతో పాటు స్క్రిప్ట్ రెడీ చేయాలని ఇద్దరికి కూడా చరణ్ సూచించాడట. అయితే వీరిద్దరిలో ఎవరితో చరణ్ తదుపరి ఉంటుందనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఇద్దరు కూడా చరణ్ కోసం చాలా కష్టపడి రెడీ అవుతున్నారట. ఆర్ఆర్ఆర్ పూర్తి అయ్యే వరకు వారితో పాటు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కూడా సస్పెన్స్ లో ఉండాల్సిందేనేమో.