టాలీవుడ్ ఆ ఫీట్ సాధించింది రామ్ మాత్రమే

0

ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అయ్యి భారీ వ్యూస్ ను దక్కించుకుంటున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. వందల కొద్ది మిలియన్ వ్యూస్ ను రాబడుతున్న తెలుగు డబ్బింగ్ సినిమాలు అక్కడ సరికొత్త రికార్డును నమోదు చేస్తున్నాయి. తెలుగు ఫిల్మ్ మేకింగ్ స్థాయి రాజమౌళి వల్ల అమాంతం పెరిగింది. అందుకే ఉత్తరాది సినీ ప్రేక్షకులకు తెలుగు నుండి వచ్చిన సినిమా అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. పలువురు యంగ్ హీరోలు అక్కడ తోపులు అయ్యారు. రామ్ నటించిన గణేష్ సినిమా ఇక్కడ తీవ్రంగా నిరాశ పర్చింది. అలాంటిది అక్కడ వంద మిలియన్ లకు పైగా వ్యూస్ ను హిందీ వర్షన్ లో దక్కించుకుంది.

గణేష్ కాకుండా రామ్ నటించిన మరో అయిదు సినిమాలు కూడా హిందీలో డబ్ అయ్యి వంద మిలియన్ అంతకు మించిన వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకున్నయి. రామ్ తెలుగులో నటించిన ఆరు సినిమాలు హిందీలో డబ్బ్ అయ్యి యూట్యూబ్ లో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నాయి.

పలువురు తెలుగు హీరోలు తమ సినిమాల హిందీ వర్షన్ లతో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్నారు. కాని ఆరు సినిమాలతో వంద మిలియన్ లకు మించి వ్యూస్ ను దక్కంచుకుంది మాత్రం రామ్ మాత్రమే. ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ స్థాయిలో ఉత్తరాదిన వ్యూస్ రాలేదు. ఉత్తరాదిన ఆరు వంద మిలియన్ లు అంతు మించి వ్యూస్ దక్కించుకున్న సినిమాలు ఉన్న హీరోగా రామ్ అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు.