‘రామరాజు ఫర్ భీమ్’ శాంపిల్ వీడియో చూపించిన చరణ్…!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ మూవీ నుంచి ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ టీజర్ ఈ నెల 22న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘రామరాజు ఫర్ భీమ్’ పేరుతో రానున్న ఈ టీజర్ అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది. తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘రామరాజు ఫర్ భీమ్’ కి చరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ‘రామరాజు ఫర్ భీమ్’ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో రామ్ చరణ్ ఈ టీజర్ కి సంబంధించిన గ్లింప్సె రిలీజ్ చేసాడు.

రేపు ‘రామరాజు ఫర్ భీమ్’ రాబోతున్నట్లు వెల్లడిస్తూ రామ్ చరణ్ ”బ్రదర్ తారక్.. నిన్ను టీజ్ చేయడానికి ఇక్కడ ఏదో ఉంది.. మీలా కాకుండా నేను సమయానికి వచ్చేలా చూస్తాను” అని ట్వీట్ చేస్తూ కన్నుగీటే ఎమోజీని పోస్ట్ చేసాడు. దీనికి రేపు రాబోయే టీజర్ లోని శాంపిల్ గ్లిమ్స్ ని జత చేసాడు చరణ్. ఈ వీడియో క్లిప్పింగ్ లో కొమరం భీమ్ పాత్రలో కనిపిస్తున్న ఎన్టీఆర్ నీళ్ల లోనుంచి ఒక బరిసెని తీస్తున్నట్లుగా చూపించారు. దీనికి కీరవాణి అదిరిపోయే బ్యాగ్రౌండ్ అందించారు. దీనితో రాజమౌళి ఏ రేంజ్ లో విజువల్ ట్రీట్ ప్లాన్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద ‘రామరాజు ఫర్ భీమ్’ అందరి అంచనాలు మించేలా ఉండబోతుందని చతెలుస్తోంది. ఇక దీనికి తారక్ రియాక్ట్ అవుతూ.. ”చరణ్ బ్రో.. మీరు ఇప్పటికే 5 నెలలు ఆలస్యం చేసారని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను.. నువ్వు జక్కన్నతో డీల్ చేస్తున్నావ్ జాగ్రత్త.. ఏమైనా జరగవచ్చు!! ఏదేమైనా వేచి ఉండలేకపోతున్నాను.. ఫుల్ ఎక్సయిట్ గా ఉంది” అని ట్వీట్ చేసాడు. మరి ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే!