అరుదైన రికార్డ్ కు చేరువలో రామరాజు ఫర్ భీమ్

0

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి ఎన్టీఆర్ కొమురం భీమ్ లుక్ ను నిన్న రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రామరాజు ఫర్ భీమ్ అంటూ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన నందమూరి అభిమానులు మరియు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టీజర్ కు రానటువంటి స్పందన ఈ టీజర్ కు వచ్చింది. కొన్ని నెలల క్రితం విడుదల అయిన భీమ్ ఫర్ రామరాజు వీడియోకు ఇప్పటి వరకు కూడా 7.5 లక్షల లైక్స్ వచ్చాయి. కాని రామరాజు ఫర్ భీమ్ వీడియోకు మాత్రం 24 గంటల్లో ఏకంగా 9.37 లక్షల లైక్స్ వచ్చాయి.

మరి కొద్ది సేపట్లో మిలియన్ మార్క్ చేరుకోబోతుంది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇంతగా లైక్స్ దక్కించుకున్న టీజర్ గా ఈ వీడియో రికార్డు సొంతం చేసుకునేందుకు రెడీగా ఉంది. ఇక వ్యూస్ విషయంలోనూ మంచి రికార్డును ఈ వీడియో సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లో ఈ వీడియోకు దాదాపుగా 14 మిలియన్ ల వ్యూస్ వచ్చాయి. అన్ని భాషల్లో కూడా ఈ టీజర్ విడుదల అవ్వడం వల్ల వ్యూస్ కాస్త తక్కువ ఉన్నాయి.

ఒకే భాషలో టీజర్ విడుదల అయ్యి ఉంటే లెక్క మరోలా ఉండేది అంటూ యూట్యూబ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలుగు వర్షన్ కు మాత్రమే కాకుండా అన్ని భాషల వర్షన్ లకు కూడా భారీ వ్యూస్ మరియు లైక్స్ వస్తున్నాయి. సినిమాపై ఉన్న అంచనాలకు ఇదో నిదర్శణంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ లుక్ మరియు టేకింగ్ అద్బుతంగా ఉంది. టీజర్ కాపీ అంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్నా కూడా రికార్డులు నమోదు అవుతూనే ఉన్నాయి.