అమితానందంలో మెగాపవర్ స్టార్.. ఎందుకంటే??

0

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ సినిమా ఆచార్య. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు ఉండటంతో.. ఆ రోజు ఏదైనా ఆచార్య నుండి సర్ప్రైజ్ ఇస్తారేమో అనే ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. రాంచరణ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ లేదా టీజర్ ఏదోక సర్ప్రైజ్ కావాలని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాంచరణ్ సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడు.

రాంచరణ్ ఆచార్య సినిమా షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చరణ్ ఇటీవలే ట్విట్టర్ వేదికగా ఆచార్య సెట్స్ లోని తన పిక్ పోస్ట్ చేసాడు. మెగాస్టార్ తో కలిసి ప్రస్తుతం రాంచరణ్.. గోదావరి జిల్లాలలో పదిహేను రోజుల షెడ్యూల్లో పాల్గొన్నాడు. రాంచరణ్ ఓ కొత్త ఫోటోతో ట్వీట్ చేస్తూ.. ‘ఇది కామ్రేడ్ మూమెంట్. ఆచార్య షూటింగ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. “నా తండ్రి మెగాస్టార్ డైరెక్టర్ కొరటాలతో టైం స్పెండ్ చేయడం ఆనందంగా ఉంది” అంటూ రాంచరణ్ భుజం పై మెగాస్టార్ చేతి వేసిన పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే ట్వీట్ పై కొరటాల శివ స్పందిస్తూ.. ‘సిద్ధ సిద్ధమవుతున్నాడు’ అని రిప్లై ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. పూజహెగ్డే రాంచరణ్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమా మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.