Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎట్టకేలకు ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??

ఎట్టకేలకు ‘వైల్డ్ డాగ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే??


టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ థియేట్రికల్ విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ చేసిన రెండు నెలల తర్వాత వైల్డ్ డాగ్ రిలీజ్ డేట్ ఖరారైంది. మొత్తానికి ఎన్నో ఊహగానాల మధ్య సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ గురించి నాగ్ మాట్లాడుతూ.. ‘మేము ఓ ప్రముఖ ఓటిటి వారు మమ్మల్ని మంచి ఆఫర్ తో కలిశారు. థియేటర్స్ ఓపెన్ అయితే జనాలు వస్తారో రారో అనే సందేహంతో ఓటిటి రిలీజుకు ఓకే చెప్పేసాం. కానీ సంక్రాంతికి క్రాక్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. మంచి కలెక్షన్స్ తో పాటు భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అలాగే ఫిబ్రవరిలో ఉప్పెన రిలీజ్ అయింది. పెద్ద హిట్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ కూడా అద్భుతంగా చేసింది. అప్పుడే మేం కూడా ఓటిటి కాదని.. థియేటర్లలో రిలీజ్ చేయడానికే నిర్ణయించాము’ అని తెలిపారు.

యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందం చుట్టూ తిరుగుతుంది. నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తుండగా.. హైదరాబాద్ను సంచలనం సృష్టించిన ఓ రియల్ లైఫ్ టెర్రర్ దాడిని ఎన్ఐఏ బృందం ఎలా చేసింది అనే కథాంశంతో వైల్డ్ డాగ్ రూపొందింది. అహిషర్ సోలమన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో దియా మీర్జా సైయామి ఖేర్ అతుల్ కులకర్ణి అలీరెజా బిలాల్ హుస్సేన్ ప్రకాష్ సుదర్శన్ లాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు. ఫాస్ట్ అండ్ ఫురియస్ 7 ఎ మ్యాన్ విల్ రైస్ లాంటి సినిమాలకు పనిచేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ షామ్ కౌశల్ డేవిడ్ ఇస్మాలోన్ ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేయడం విశేషం. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. ఇదిలా ఉండగా నాగ్ త్వరలో బాలీవుడ్ బ్రహ్మస్త్ర బంగార్రాజు సినిమాలలో కనిపించబోతున్నాడు.