Templates by BIGtheme NET
Home >> Cinema News >> చనిపోయేంత సీరియస్సా! అసలు రానాకి ఏమైంది!?

చనిపోయేంత సీరియస్సా! అసలు రానాకి ఏమైంది!?


యంగ్ హీరో రానా అనారోగ్యం గురించి లాక్ డౌన్ ముందు బోలెడంత చర్చ సాగింది. భళ్లాలునికి సీరియస్ అంటూ ఫ్యాన్స్ భయపడేంతగా కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే ఏదోలా ఆ గండం నుంచి గట్టెక్కాడు రానా. అమెరికాలో చికిత్స చేయించుకుని తిరిగి మామూలు మనిషి అయ్యాడు. అయితే తనకు గుండెపోటు వచ్చేందుకు 70శాతం ఛాన్సెస్.. చనిపోయేందుకు 30 శాతం అవకాశం ఉందని డాక్టర్ చెప్పారంటూ సామ్ జామ్ ఓటీటీ కార్యక్రమంలో రానా చెప్పడంతో అంతా ఉలిక్కిపడ్డారు.

అసలు రానాకి ఏమైంది? అన్నది సామ్ జామ్ పూర్తి కార్యక్రమంలో రివీలైంది. అరణ్య షూటింగ్ టైమ్ లో రానా అనారోగ్యం గురించి అసలు విషయం బయటపడింది. ఓ లెన్స్ ధరించేందుకు కంటికి ఆపరేషన్ చేయించుకున్న రానా బీపీ చూస్కుని షాక్ తిన్నాడట. డాక్టర్లు అన్ని టెస్టులూ చేసి 220/192 బీపీ ఉందని.. ఒక మనిషికి ఉండాల్సిన బీపీ కన్నా రెండు రెట్లు అధికంగా ఉందని అన్నారట. సీన్ అర్థమై వెంటనే నాన్న(సురేష్ బాబు)గారితో కలిసి చికిత్సకు అమెరికాకు వెళ్లాడట.

అమెరికాలో మేయో క్లినిక్ లో డాక్టర్ శాంతి స్వరూప్ బేగే తనకు సన్నిహితుడు.. పుట్టుకతోనే తనకు అత్యధిక రక్తపోటు ఉన్నా ఎవ్వరూ దాన్ని గుర్తించలేకపోయారని.. దాని వల్ల శరీరంలో కొన్ని అవయవాలు దెబ్బతిన్నాయని షాక్ మీద షాకిచ్చారట డాక్టర్. గుండె చుట్టూ కాల్షియం పేరుకుపోయింది. కిడ్నీలు పాడైపోయాయి. శస్త్రచికిత్స చేయకపోతే 70 గుండెపోటు వచ్చే అవకాశం.. 30 శాతం చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. ఆరు నెలల్లో ఇది జరగొచ్చు అని షాకిచ్చారట.

ఆ దెబ్బకు నాన్ వెజ్.. ఆల్కహాల్ సిగరెట్ అన్నిటినీ మానేశాడట. ఒక్కరోజులో అన్నీ మార్చేశానని రానా కన్నీటిపర్యంతమవుతూ తన ఆరోగ్య సమస్యను వివరించారు. సరైన సమయంలో సరైన చికిత్సతో రానా బయటపడ్డారు. ఇది అందరికీ సంతోషం.