Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘మిషన్ ఫ్రంట్ లైన్’ కోసం బార్డర్ లో BSF జవాన్ గా విధులు నిర్వర్తించిన రానా..!

‘మిషన్ ఫ్రంట్ లైన్’ కోసం బార్డర్ లో BSF జవాన్ గా విధులు నిర్వర్తించిన రానా..!


టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ దగ్గుబాటి రానా రియల్ లైఫ్ అడ్వెంచర్ చేసాడు. BSF జవాన్ అవతారమెత్తి ఒక రోజంతా బార్డర్ లో విధులు నిర్వర్తించాడు. డిస్కవరీ ప్లస్ ఒరిజినల్ యొక్క ‘మిషన్ ఫ్రంట్ లైన్’ కార్యక్రమం కోసం రానా జవాన్ గా మారాడు. ‘మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి’ పేరుతో వస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన రానా లుక్ ని సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేశారు. జైసల్మేర్ సరిహద్దుల్లో ఒక రోజంతా గడిపిన రానా.. ఇదో లైఫ్ టైం ఎక్సపీరియన్స్ అని.. తనపై యుద్ధ కథలు బలమైన ముద్ర వేశాయని పేర్కొన్నాడు. ”జైసల్మేర్ లో ఒక బిఎస్ఎఫ్ జవాన్ గా ఒక రోజు గడపడం జీవితకాల అనుభవం. యుద్ధ కథలు – అనుభవాలు నాపై బలమైన ముద్ర వేశాయి. నేను వాటిని ఎప్పటికీ మర్చిపోలేను. మిషన్ ఫ్రంట్ లైన్ కి అవకాశమిచ్చిన డిస్కవరీ ఇండియాకు ధన్యవాదాలు” అని రానా ట్వీట్ చేసాడు.

రానా ఈ సందర్భంగా ‘మిషన్ ఫ్రంట్ లైన్ విత్ రానా దగ్గుబాటి’ కార్యక్రమానికి సంబంధించిన ఓ పోస్టర్ ని షేర్ చేశాడు. ఇందులో రానా BSF జవాన్ గా గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ కార్యక్రమం డిస్కవరీ ప్లస్ ఒరిజినల్ లో త్వరలోనే విడుదల కానుంది. కాగా ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రానా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ‘అరణ్య’ అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ‘అరణ్య’ 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే వేణు ఉడుగుల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ అనే సోషల్ డ్రామాలో నటిస్తున్నాడు. అంతేకాక గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి కూడా రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మిలింద్ రౌ దర్శకత్వంలో ఓ త్రిభాషా చిత్రం చేయనున్నాడు.