వైరల్ అవుతున్న నూతన దంపతుల స్మైలింగ్ పిక్.. ఏంటి స్పెషల్..?

0

బ్యాచిలర్ హీరో రానా పెళ్లి తంతు కాస్త ముగించుకొని ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న రానా – మిహీకల వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు రాంచరణ్ అల్లు అర్జున్ లతో పాటు కొద్దిమంది మాత్రమే ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఈ పెళ్లివేడుకలో పెళ్లికూతురు పెళ్లి కొడుకుల డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలిచింది. హీరోయిన్ సమంత కూడా దగ్గుబాటి కుటుంబంలోకి మిహికను సాదరంగా ఆహ్వానించింది. రానా మిహికల రోకా వేడుక దగ్గర నుండి పెళ్లి వరకు మిహిక కాస్ట్యూమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత రానా మిహికలు ఇటీవలే బయట కనిపించారు. ఇప్పటికి ఈ కొత్త దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రానా-మిహికలు తాజాగా సత్యనారాయణ పూజ కూడా ముగించారట. అయితే పెళ్లి తర్వాత దిగిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో రానా మిహిక ఓ ఫోటోలలో ఇద్దరు నవ్వుతున్న ఫోటో ఒకటి బాగా ఆకర్షిస్తుంది. ఆ ఫోటోలో మిహిక మరింత అందంగా కనిపించడం విశేషం. రానా తన లాప్ టాప్ లో మిహికకు ఏదో చూపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సాంప్రదాయ దుస్తులలో రానా మిహికలు మెరిసి పోతున్నారు. ముఖ్యంగా రానా భార్య మిహిక చీరలో ఎంతో అందంగా ఉందంటూ అందరూ కొనియాడుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వీరి పెళ్ళి తక్కువ మంది వివాహ అతిథుల మధ్య జరిగింది. అయితే లాప్ టాప్ లో రానా మిహికలు వారి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.