Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న రానా-చైతూల హ్యాపీ పిక్..!!

వైరల్ అవుతున్న రానా-చైతూల హ్యాపీ పిక్..!!


టాలీవుడ్ హీరో రానా పెళ్లి తంతు ముగిసి పది రోజులు అవుతుంది. ఇక ప్రస్తుతం రానా ఫ్యామిలీ మ్యాన్ అయ్యాడు. బాజాభజంత్రిల నడుమ రానా తన ప్రేయసి మిహీక బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసిన రానా.. ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో కొద్దిమంది సన్నిహితుల మధ్య ఆగస్టు 8న రానా – మిహీకల వివాహం జరిగింది. ఇక ఈ ప్రేమికుల పెళ్ళికి సినీహీరోలు రాంచరణ్ అల్లు అర్జున్ లతో నాగచైతన్య దంపతులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో పెళ్లికూతురు పెళ్లి కొడుకుల డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేకంగా నిలిచింది. హీరోయిన్ సమంత కూడా దగ్గుబాటి కుటుంబంలోకి మిహికను సాదరంగా ఆహ్వానించింది. రానా మిహికల రోకా వేడుక దగ్గర నుండి పెళ్లి వరకు ఇద్దరి కాస్ట్యూమ్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత రానా మిహికలు ఇటీవలే బయట కనిపించారు. ఇప్పటికి ఈ కొత్త దంపతుల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే రానా-మిహికలు తాజాగా సత్యనారాయణ పూజ కూడా ముగించారట. అయితే పెళ్లి తర్వాత దిగిన కొన్ని ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య-రానాల హ్యాపీ మూమెంట్ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో రానా డోల్ వాయిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. వీరిద్దరి వెనుక నాగచైతన్య నవ్వుతూ నమస్తే పెడుతున్న పోజు తెగ ఆకట్టుకుంటుంది. మ్యారేజ్ జరిగే టైంలో ఈ ఫోటో కాప్చర్ చేశారట. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారు.