Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఎస్పీ బాలు కోసం సామూహిక ప్రార్థనలు

ఎస్పీ బాలు కోసం సామూహిక ప్రార్థనలు


గాన గంధర్వుడు.. దేశంలోనే ప్రముఖ గాయకుడు అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆ మహమ్మారి బారినపడి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోరుతూ సినీ ప్రముఖులంతా ఇవాళ సాయంత్రం 6-6.05 నిమిషాల సమయంలో ఎవరి ఇళ్లలో వారు ప్రార్థించాలని డిసైడ్ అయ్యారు.

ఈ సందర్భంగా ఈ ప్రార్థనలో పాల్గొనాలని ప్రముఖ దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కోరారు. బాలు మేలు కోరేవారంతా ఆయన పాటను ప్లే చేస్తూ ప్రార్థనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇక రజినీకాంత్ తోపాటు కమల్ హాసన్ – ఇళయరాజా – రెహమాన్ – థమన్ – లాంటి ప్రముఖులు కూడా ఈ ఉమ్మడి ప్రార్థనల్లో భాగంగా కావాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులను కోరారు.

ఈ సందర్భంగా అందరూ అభిమానుల కోరిక మేరకు దేవుడు ఈ సామూహిక ప్రార్థనలను వింటాడని.. బాలును కోలుకునేలా చేస్తాడని రజినీకాంత్ ఆశాభావం వ్యక్తంచేశాడు.