దుబాయ్ లో ‘రంగ్ దే’

0

నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న రంగ్ దే సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను దుబాయిలో చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే దుబాయ్ వెళ్లిన యూనిట్ సభ్యులు వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యింది. దుబాయ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న సందర్బంగా అక్కడ తెలుగు వారు ఫొటో తీసి షేర్ చేశారు. దాంతో ఈ ఫొటో కాస్త వైరల్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల చేసేందుకు గాను చకచక చిత్రీకరణ జరుపుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో పూర్తి స్థాయి ఎంటర్ టైన్ మెంట్ తో ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. నితిన్ ఈ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే అవి ప్రారంభం అయ్యాయి. ఇక నితిన్ దుబాయ్ కి షూటింగ్ తో పాటు హనీమూన్ కు కూడా వెళ్లాడు. భార్యతో కలిసి నితిన్ దుబాయ్ వెళ్లిన విషయం తెల్సిందే.