హర్ట్ చేయొద్దు అంటూ రాశీ ఖన్నా సందేశం

0

ఎవరిని హర్ట్ చేసేలా మాట్లాడినా తిరిగి అది మనకు రివర్సులో వచ్చేస్తుంది ఏదో రూపంలో. అలా కాకుండా ఒకరు సంతోషంగా ఉంటే ఆ జోయ్ అందరికీ ఆనందంగా మారుతుంది.. అంటూ అద్భుతమైన కొటేషన్ ఇచ్చింది అందాల రాశీ ఖన్నా.

తాజాగా ఈ భామ ఇన్ స్టాగ్రమ్ లో ఎంతో అందమైన ప్రకృతి రమణీయత నడుమ ఎంతో జాయ్ ఫుల్ మూడ్ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. తటాకం మీదుగా దూరంగా కొండలు కోనలు ఆకాశంలో నల్ల మబ్బులు వర్షించేందుకు సిద్ధంగా ఉన్నాయా? అన్న తీరుగా ఆ ఫోటో ఎంతో ప్లెజెంట్ అప్పియరెన్స్ ని ఎలివేట్ చేస్తోంది.

బయటకు కనిపించని ఎన్నో వెబ్ స్టోరీస్ ఉన్నాయ్.. వెతికితేనే అవి బయటపడతాయి.. ఎవరి వెనకా ఏదీ మాట్లాడవద్దు.. తెలిసీ తెలియక గాయపరిచేవి అసలే మాట్లాడొద్దు. వాటివల్ల మనకు హాని కలుగుతుంది!! అసలు ఈ విశ్వానికి హాని కలిగించేది ఏదీ చేయొద్దు!! అంటూ రాశీ ఎంతో మంచి మాటనే చెప్పింది. నిజానికి రాశీ ఖన్నా తదుపరి ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతోందని ఇటీవల కథనాలొచ్చాయి. బహుశా తన మాటల్లో అలాంటి కాన్సెప్టు ఏదో దాగి ఉందని అర్థమవుతోంది. రాశీ ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.