Templates by BIGtheme NET
Home >> Cinema News >> సైబర్ బెదిరింపులపై కుర్ర బ్యూటీ స్పెషల్ క్లాస్

సైబర్ బెదిరింపులపై కుర్ర బ్యూటీ స్పెషల్ క్లాస్


సోషల్ మీడియా వేధింపులు .. ట్రోలింగ్స్ బెడద కథానాయికలకు అపరిమితంగా ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏ విషయాన్ని చెప్పాలన్నా ఈ వేదికను సెలబ్రిటీలు ఆసరాగా చేసుకుంటుండడంతో అక్కడ ఇష్టానుసారం చెలరేగేవాళ్లే ఎక్కువయ్యారు. ఆ తరహాలో చూస్తే యంగ్ బ్యూటీ రష్మిక మందన్నకు ఎదురైన వేధింపులు అన్నీ ఇన్నీ కావు. తన మాజీ ప్రేమికుడు రక్షిత్ తో బ్రేకప్ అయ్యాక ఈ తరహా వేధింపుల్ని ఎదుర్కొంది రష్మిక.

అయితే సైబర్ బెదిరింపు విషయానికి వస్తే తన అనుభవాల దృష్ట్యా రష్మిక కంటే సైబర్ బెదిరింపును ఎవరు బాగా అర్థం చేసుకుంటారు. సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా సైబర్ బెదిరింపు ఎలా సాధారణమైందనే దాని గురించి రష్మిక తన ఇటీవలి సోషల్ మీడియా పోస్ట్ లో మాట్లాడారు.

బాడీ-షేమింగ్ .. క్యారెక్టర్-షేమింగ్ వంటివి తనని బాగా బాధ పెట్టాయట. డిజిటల్ లో ప్రమాదాల గురించి కలత చెందిన రష్మిక సెలబ్రిటీల శ్రేయస్సు గురించి ఆలోచించి దృష్టి పెట్టాలని మంచి ఉపయోగం ఉండే ప్రత్యామ్నాయ మార్గం వెతకాలని కోరింది. ఎందుకంటే సోషల్ మీడియా ఒక వ్యక్తిని రక్షించగలదు లేదా చంపగలదు. ద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా మంచి కోసం సరైన మార్గంలో ఎదుగుదల కోసం సామాజిక మాధ్యమాల్ని ఫోన్ లు డిజిటల్ డివైస్ ని ఉపయోగించాలని రష్మిక కోరింది.

సానుకూల ప్రయోజనాల కోసం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను ఉపయోగిస్తున్న వారు.. ఫోన్ మన చేతిలో ఉండగా ప్రతిదాన్ని దాదాపుగా చేయగలిగినప్పుడు.. ప్రపంచం మొత్తం మంచి వైపు ఉండేలా దిశా నిర్ధేశనం చేయాలని .. డిజిటల్ వేదికను దుర్వినియోగం చేయలేదని నిర్ధారించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని గట్టిగానే క్లాస్ తీస్కుంది.