మాస్క్ ఎక్కడని అడిగితే జడేజా భార్య రెచ్చిపోయింది

0

భారత క్రికెట్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అతడి భార్య రివిబా వివాదంలో చిక్కుకున్నారు. రివాబా మాస్క్ ధరించకపోవడంపై నిలదీసిన లేడీ కానిస్టేబుల్తో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. గుజరాత్ పోలీసుల వివరాల ప్రకారం.. జడేజా తన భార్య రివాబా తో కలిసి సోమవారం రాత్రి 9. గంటల సమయంలో కారులో వెళ్తుండగా వీరి వాహనాన్ని తనిఖీ చేసేందుకు మహిళా కానిస్టేబుల్ సోనాల్ గోసాయ్ అడ్డగించారు. కారు డ్రైవింగ్ సీట్లో జడేజా మాస్క్ ధరించి ఉన్నప్పటికీ అతని భార్య మాస్క్ ధరించలేదు. ఎందుకు మాస్క్ ధరించ లేదని ప్రశ్నించడంతోపాటు జరిమానా చెల్లించాలని మహిళా పోలీస్ అడిగింది.

దీంతో రవీంద్ర జడేజా కు కానిస్టేబుల్ కు వాదన జరిగింది. అది పెద్ద గొడవకు దారి తీసింది. రివాబా మహిళా పోలీసుతో దురుసుగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. తమ ప్రాథమిక దర్యాప్తు లో జడేజా భార్య రవిబా మాస్క్ ధరించలేదని వెల్లడైందని పోలీసులు తెలిపారు. అసలు వీరి మధ్య గొడవ ఎందుకు పెద్దదయ్యిందనే విషయంపై దర్యాప్తు జరుగుతుందని వివరించారు.ఘర్షణ అనంతరం మహిళా కానిస్టేబుల్ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఐతే ఈ ఘటనకు సంబంధించి ఇటు జడేజా నుంచి అటు కానిస్టేబుల్ నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతుండటం విశేషం.