Templates by BIGtheme NET
Home >> Cinema News >> రియాల్టీ షో ప్రైజ్ మనీ వెనుక షాకింగ్ విషయం

రియాల్టీ షో ప్రైజ్ మనీ వెనుక షాకింగ్ విషయం


బుల్లి తెరపై ఈమద్య కాలంలో రియాల్టీ షోలు ఎక్కువ అయ్యాయి. కేబీసీ.. బిగ్ బాస్.. ఇంకా పలు షో ల ద్వారా భారీ మొత్తాలను ప్రైజ్ మనీగా ఇస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో కోటి రూపాయల వరకు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంత భారీ మొత్తంను విజేత గెలుచుకున్న సమయంలో అతడి చేతికి వచ్చేది ఎంత.. నిజంగానే అంత మొత్తం ఇస్తారా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. కొందరు కోటి రూపాయలు వెంటనే విజేతకు ఇచ్చేస్తారు అని అనుకుంటారు. కాని దాని వెనుక చాలా కథ నడుస్తుంది.

ఇన్ కమ్ ట్యాక్స్ నియమ నిబంధనల ప్రకారం రియాల్టీ షోలో గెలిచిన మొత్తం నుండి దాదాపుగా 45 శాతంను పన్నుల రూపంలో ప్రభుత్వంకు చెల్లించాల్సి ఉంటుంది. ఏ రియాల్టీ షో లో అయినా కూడా కోటి రూపాయలు ప్రైజ్ మనీ గెలిచారే అనుకుందాం. అందులో నుండి కంటెస్టెంట్ కు వచ్చేది కేవలం 65 లక్షలు మాత్రమే. మిగిలిన మొత్తం కూడా వివిధ రూపాల్లో పన్నులుగా ప్రభుత్వంకు ఇవ్వాల్సి ఉంటుంది. ఛానెల్స్ ఆ పన్నులను భరించకుండా కంటెస్టెంట్స్ కు ఇచ్చి.. వారే పన్ను రూపొంలో కట్ చేసి ప్రభుత్వంకు చెల్లించడం జరుగుతుంది. కోటి రూపాయలు గెలిచాం అని సంతోషిస్తున్న సమయంలోనే 35 లక్షలు పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందని కంటెస్టెంట్స్ బాధపడాల్సి వస్తుంది.